మనసును హైజాక్‌ చేసి...  | Agent mvoie will release on April 28. | Sakshi
Sakshi News home page

మనసును హైజాక్‌ చేసి... 

Published Thu, Feb 23 2023 1:54 AM | Last Updated on Thu, Feb 23 2023 1:54 AM

Agent mvoie will release on April 28. - Sakshi

‘మళ్లీ మళ్లీ నువ్వే ఎదురెదురొస్తే దట్స్‌ ఏ సైన్‌ అని మనసంటుందే.. నా లేటెస్ట్‌ మిషనువు నువ్వే.. సాధించాలనిపిస్తుందే...’ అంటూ సాగుతుంది ‘ఏజెంట్‌’ చిత్రంలోని పాట. అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పైయాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఏజెంట్‌’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌. ఈ సినిమా నుంచి ‘మళ్లీ మళ్లీ నువ్వే... మనసే హైజాక్‌ చేసి కొల్లగొట్టావు’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్‌ బుధవారం విడుదల చేసింది.

ఆదిత్యా అయ్యంగార్‌ సాహిత్యం అందించిన ఈ పాటను ఈ చిత్ర సంగీతదర్శకుడు హిప్‌హప్‌ తమిళ పాడారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌రెడ్డి 2 సినిమాస్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌ సుంకర, దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘ఏజెంట్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement