Siva Karthikeyan, Kichcha Sudeep To Launch Akhil Agent Teaser - Sakshi
Sakshi News home page

Akhil Agent Teaser: అఖిల్‌ 'ఏజెంట్' టీజర్‌ రిలీజ్‌.. చూశారా !

Published Fri, Jul 15 2022 5:36 PM | Last Updated on Fri, Jul 15 2022 6:19 PM

Siva Karthikeyan Kichcha Sudeep Launched Akhil Agent Teaser - Sakshi

Akhil Agent Teaser Released: అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్‌ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను స్టార్‌ యాక్టర్స్‌ శివకార్తికేయన్‌, కిచ్చా సుదీప్‌ విడుదల చేశారు. 

ఈ టీజర్‌లో అఖిల్ సిక్స్‌ ప్యాక్‌ బాడీ, సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అఖిల్‌కు మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఇచ్చే ఎలివేషన్‌ బాగుంది. అలాగే యాక్షన్‌ సీన్స్‌, 'వైల్డ్ సాలే' అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్‌.. అఖిల్ ఫ్యాన్స్‌ పండుగ చేసుకునేలా ఉందని చెప్పవచ్చు. కాగా 'ఏజెంట్‌' చిత్రాన్ని హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ సిరీస్‌ 'బోర్న్‌' ఆధారంగా తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే.  

చదవండి: అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్‌.. యాంకర్‌పై ఆగ్రహం
ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?..


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement