ఫారిన్‌లో ఫైట్‌  | Akhil Movie Agent Release in april | Sakshi
Sakshi News home page

ఫారిన్‌లో ఫైట్‌ 

Published Mon, Feb 13 2023 2:30 AM | Last Updated on Mon, Feb 13 2023 5:18 AM

Akhil Movie Agent Release in april - Sakshi

ఫారిన్‌లో యాక్షన్‌ ప్లాన్‌ చేశారు ‘ఏజెంట్‌’. అఖిల్‌ హీరోగా  సురేందర్‌ రెడ్డి  దర్శకత్వంలో  రూపొందుతున్న స్టైలిష్‌ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ‘ఏజెంట్‌’.  ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌. ఏకే  ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ తుది దశకు చేరుకుంటోంది.

ఇందులో భాగంగా ఓ ఫారిన్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట యూనిట్‌. ఓ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం వచ్చే వారంలో చిత్ర బృందం విదేశాలకు వెళ్లనుందట. ఈ షెడ్యూల్‌తో ‘ఏజెంట్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తవుతుందట. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.  కాగా ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్‌’  రిలీజ్‌ కానుంది. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతలు: అజయ్‌  సుంకర, దీపా  రెడ్డి, కెమెరా: రసూల్‌ ఎల్లోర్, సంగీతం: హిప్‌ హాప్‌ తమిజా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement