
రేవంత్ ఆంధ్ర ఏజెంట్
ఆయనకు చీము నెత్తురు ఉంటే చంద్రబాబు ఇంటిని ముట్టడించాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి :తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి చంద్రబాబు పంపిన ఏజెంటే రేవంత్‌రెడ్డి అని, ఇలాంటి ఇంటి దొంగ పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అంచనా పద్దుల కమిటీ ఛైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో టెలిఫోన్‌లో మాట్లాడారు. రేవంత్‌కు సిగ్గూ శరం, చీమూ నెత్తురు ఉంటే సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు నీళ్లందించే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టొద్దని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను బలవంతంగా ఏపీలో కలుపుకున్నప్పుడు ఈ రేవంత్‌రెడ్డి కళ్లలో ఏం పెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఆంధ్రా పెత్తనం పోయినా ఆంధ్ర వాళ్ల కుట్రలు మాత్రం కొనసాగటం దురదృష్టకమన్నారు. రేవంత్‌రెడ్డి ఒక దొరికిన దొంగ అని, ఓట్లకు నోట్ల కేసులో ఆయన జైలు జీవితం గడపాల్సిన రోజులు ముందున్నాయన్నారు.