Agent Movie Postponed Due To Corona - Sakshi

Agent Movie: లేట్‌గా వస్తున్న 'ఏజెంట్‌'.. డేట్‌ మారినా దూకుడు మారదు

Dec 25 2021 8:21 AM | Updated on Dec 25 2021 8:59 AM

Agent Movie Postponed Due To Corona - Sakshi

Agent Movie Postponed Due To Corona: థియేటర్స్‌లోకి కాస్త ఆలస్యంగా రాబోతున్నాడు ‘ఏజెంట్‌’. అక్కినేని అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న స్పై థ్రిల్లర్‌ మూవీ ‘ఏజెంట్‌’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్‌గా కనిపించనుంది. శుక్రవారం (డిసెంబరు 24) విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్‌ సుంకర సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ‘‘కరోనా వల్ల మా ‘ఏజెంటు’ డేటు మారినా దర్జా మారదు. దూకుడు మారదు. ధీమా మారదు. అఖిల్‌ అద్భుతమైన యాక్టింగ్, సురేందర్‌ రెడ్డి స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌తో ‘ఏజెంట్‌’ వరల్డ్‌ క్లాస్‌ స్పై థ్రిల్లర్‌గా రాబోతోంది’’ అని ట్వీట్‌ చేశారు అనిల్‌ సుంకర. 

ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో దసరా హీరోగా మారాడు అఖిల్. రుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొ​ట్టాడు అక్కినేని వారసుడు. అయితే 'ఏజెంట్' మూవీని 'బ్యాచ్‌లర్‌'ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. రామబ్రహ్మం సుంకర మరో నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కో– ప్రొడ్యూసర్స్‌: అజయ్‌ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి. 


ఇదీ చదవండి: మాస్ సాంగ్‌తో 'బంగార్రాజు' షూటింగ్‌ పూర్తి.. నాగార్జున ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement