RRR Movie Will Be Postponed Due TO Omicron - Sakshi
Sakshi News home page

RRR Movie: 'ఆర్‌ఆర్‌ఆర్‌' అభిమానులకు కొత్త టెన్షన్‌.. సినిమా వాయిదా పడుతుందా ?

Published Sat, Dec 25 2021 10:30 AM | Last Updated on Sat, Dec 25 2021 10:43 AM

RRR Movie Will Be Postponed Due TO Omicron - Sakshi

RRR Movie Will Be Postponed Due TO Omicron: సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్‌). సుమారు 14 భాషల్లో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు బడ్జెట్‌కు (రూ. 400 కోట్లు) మించి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, పాటలు, మేకింగ్‌ వీడియోలు అశేష ఆధరణ పొందుతున్నాయి. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు. తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న సినిమా విడుదలైతే బ్రేక్‌ ఇవ్వడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన‍్న చర్చ జోరుగా నడుస్తోంది. 

మొన్నటి దాకా కరోనా వచ్చి ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నామన్న నమ్మకంతో థియేటర్లన్ని తెరుచుకున్నాయి. దీంతో సినిమాలకు పూర్వవైభవం వస్తుందని సినీ లోకం, ప్రేక్షకులు భావించారు. అయితే తాజాగా ఈ సినిమాల సంబరానికి ఒమిక్రాన్‌ బ్రేక్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట‍్రాలు రాత్రి పూట కర్ఫ్యూ కూడా విధించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ రిలీజ్ తేది నాటికి మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు అని చర్చిస్తున్నారు. మరీ ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలై వెండితెరపై బొమ్మ పడే దాకా ఈ వాయిదా టెన్షన్‌ తప్పేలా లేదు. 



ఇదీ చదవండి: అలరిస్తున్న అల్లూరి, గర్జిస్తున్న భీం.. మేకింగ్‌ వీడియోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement