
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్‌లో కనిపించనున్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై బాగా హైప్‌ను క్రియేట్ చేశాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ఏందే ఏందే అంటూ ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు. మలాయళ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.