ఏజెంట్‌ బ్యూటీ ధరించిన డ్రస్‌ ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే! | Doy You Know Sakshi Vaidya Fashion Brand Price | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ బ్యూటీ ధరించిన డ్రస్‌ ధర వింటే షాక్‌ అవ్వాల్సిందే!

Published Sun, Jul 30 2023 7:41 AM | Last Updated on Sun, Jul 30 2023 7:41 AM

Doy You Know Sakshi Vaidya Fashion Brand Price

ఏజెంట్‌’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాక్షి వైద్య.. తన ట్రెండీ రీల్స్‌.. ట్రెండీ లుక్స్‌తో సోషల్‌ మీడియాలో మంచి ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్‌ చేసుకుంది. నేను హీరోయిన్‌ అయ్యాను ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను. లాక్‌డౌన్‌లో రీల్స్‌ చేయడం, ఆడిషన్స్‌ ఇవ్వడం తర్వాత సినిమాలో నటించటం.. వీటన్నింటినీ తలచుకుంటే నా జీవితం నాకే సర్‌ప్రైజ్‌గా అనిపిస్తోందని అంటోంది సాక్షి వైద్య.  ఆమెకు అంతటి ఫాలోయింగ్‌ని పెంచడంలో ఈ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ సృష్టించిన స్టయిల్‌ రోల్‌ తక్కువేం కాదు!
--సాక్షి వైద్య

దేబ్యానీ..
మహారాణిగా మెరిసిపోవాలంటే దేబ్యానీ దుస్తులను ధరించాల్సిందే! నిజాం, మొఘల్స్‌ రాచరికం ఉట్టిపడేలా వీరి చీరలు, అనార్కలీలు, షరారాలు ఉంటాయి. అదే వీరి బ్రాండ్‌ వాల్య. ఆఫ్‌ బీట్‌ ఫ్యూజన్‌ వేర్, డ్రేప్, బస్టియర్, బంధనీ ప్రింట్స్, చందేరీ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో లభించే ఈ బ్రాండ్‌ దుస్తులను సెలబ్రిటీలు తెగ ఇష్టపడతారు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోన లభ్యం. ఇంతకీ ఆమె ధరించిన దేబ్యానీ డ్రస్‌ ధర రూ. 100,000/-

కర్ణిక జ్యూయెల్స్‌..
ష్యాషన్‌కి తగ్గ ఆభరణాలతోనే అందం మరింత పెరుగుతుందన్న మాటను బలంగా నమ్మింది కర్ణిక జ్యూయెల్స్‌ ఫౌండర్‌ నిత్యారెడ్డి. అందుకే, ఎప్పటికప్పడు ఆకట్టుకునే అందమైన, వైవిధ్యమైన డిజైన్స్‌ని రపొందిస్త కర్ణిక జ్యూయెల్స్‌ని టాప్‌ మోస్ట్‌ సెలబ్రిటీ బ్రాండ్‌గా నిలిపింది. అన్ని రకాల బంగారు, వెండి, బంగారు పూత నగలతో పాటు, ఫ్యూజన్, నక్షి, నవరతన్, స్వరోవ్‌స్కీ వంటి ఇతర బ్రాండ్ల నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కూడా కొనుగోలు చేసే వీలుంది. జ్యూలరీ బ్రాండ్‌: కర్ణిక జ్యూయెల్స్‌ రూ. 33,000/-

(చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement