అఖిల్‌ 'ఏజెంట్‌' టీజర్‌పై మహేశ్‌ బాబు రివ్యూ.. | Mahesh Babu Praises On Akhil Agent Teaser | Sakshi
Sakshi News home page

Mahesh Babu: అఖిల్‌ 'ఏజెంట్‌' టీజర్‌పై మహేశ్‌ బాబు రివ్యూ..

Published Sun, Jul 17 2022 3:41 PM | Last Updated on Sun, Jul 17 2022 3:49 PM

Mahesh Babu Praises On Akhil Agent Teaser - Sakshi

Mahesh Babu Praises On Akhil Agent Teaser: అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 12న విడుదల కానుంది.  హై ఓల్టేజ్ యాక్షన్ అండ్‌ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మూవీ టీజర్‌, అఖిల్‌ లుక్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.  

కాగా ఈ మూవీ టీజర్‌ను, అఖిల్‌ లుక్స్‌ను పలువురు కొనియాడారు. తాజాగా ఈ టీజర్‌పై సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు ప్రశంసలు కురిపించారు. 'ఏజెంట్ టీజర్‌ అద్భుతంగా ఉంది. విజువల్స్‌, సినిమా థీమ్‌ ఎంతో నచ్చింది. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌.' అని ట్విటర్‌ వేదికగా ట్వీట్‌ చేశాడు మహేశ్‌ బాబు. ఈ ట్వీట్‌పై అఖిల్‌ స్పందించాడు.  'థ్యాంక్యూ బ్రదర్‌. మీ సపోర్ట్‌, ప్రోత్సాహాం ఎంతో విలువైనది.' అని రీట్వీట్‌ చేశాడు. అలాగే శర్వానంద్‌ ట్వీట్‌పై కూడా స్పందించాడు అఖిల్‌. ప్రస్తుతం 'ఏజెంట్‌' టీజర్‌ యూట్యూబ్‌లో మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. 

చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్‌
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
చోర్ బజార్‌లో రూ.100 పెట్టి జాకెట్‌ కొన్నా: స్టార్‌ హీరో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement