Akhil Akkineni Agent Shooting At Hyderabad Metro Station - Sakshi

Akhil Akkineni: హైదరాబాద్‌ మెట్రోలో అఖిల్‌ అక్కినేని.. ఫోటో వైరల్‌

Mar 26 2022 2:06 PM | Updated on Mar 26 2022 2:51 PM

Akhil Akkineni Agent Shooting At Hyderabad Metro Station - Sakshi

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ అక్కినేని నటిస్తున్న సినిమా ఏజెంట్‌. ఇప్పటివరకు లవర్‌ బాయ్‌గా కనిపించిన అఖిల్‌ ఈ సినిమా కోసం యాక్షన్‌ హీరోగా మారుతున్నాడు. ఇందుకోసం షూటింగ్‌కి ముందు నుంచే తెగ కష్టపడుతున్న అఖిల్‌ ఈ చిత్రంలో సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. కండలు తిరిగిన బాడీతో  బీస్ట్‌ లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేసేందుకు రెడీ అయ్యాడు.‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తర్వాత అఖిల్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

ఆగస్టు 12 ఈ సినిమాను విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రోలో అఖిల్‌ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్‌లో భాగంగా అఖిల్‌కి సీన్స్‌ వివరిస్తున్నట్లుగా ఫోటోలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement