భద్రాద్రి కొత్తగూడెం: గల్ఫ్ దేశాల్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు ఏజెంట్లు అమయాక మహిళలను మోసం చేస్తున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లాకు చెందిన విజయలక్ష‍్మీ (40) అనే మహిళ కూడా ఇలాగే అమలాపురానికి చెందిన ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. ఉద్యోగం వస్తుందని నమ్మి గల్ఫ్ దేశం ఒమన్ వెళ్లిన ఆమెను మస్కట్‌లో ఎయిర్‌పోర్టు అధికారులు ఆపారు. ఆమె వీసా నకిలీదని గుర్తించి అరెస్టు చేశారు.
అనంతరం కేరళలోని కొచ్చికి తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఏర్నాకులం పోలీస్ స్టేషన్‌కు రిమాండ్‌కు తరలించారు. ఏజెంట్ చేతిలో ఆమె మోసపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఒమన్ కేసులను వాదించే కోర్టులు ప్రస్తుతం కేరళో మూతపడ్డాయి. దీంతో విజయలక్ష‍్మీ జైల్లోనే మగ్గుతోంది. ఎవరైనా సాయం చేస్తారని ఎదురు చూస్తోంది.
విజయలక్ష‍్మి భర్త మరణించారు. కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తల్లి పూలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. తన కొడుకు ఉన్నత చదువుల కోసం డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతోనే విజయలక్ష‍్మీ గల్ప్ దేశం వెళ్లాలనుకుంది. కానీ ఏజెంట్‌ను నమ్మి మోసపోయి ఇప్పుడు జైల్లో దుర్భర జీవితం గడుపుతోంది.
చదవండి: కోర్టు ముందు బోరున విలపించిన పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీ
Comments
Please login to add a commentAdd a comment