
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్‌డేట్‌ను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటgంsyత ఈ చిత్రం నుంచి త్వరలోనే మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్28న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment