
రాధ(ఫైల్)
చిత్తూరు, మదనపల్లె క్రైం : తన భార్యను ఓ ఏజెంట్ కువైట్‌కు పంపుతానని నమ్మబలికి తీసుకెళ్లి ఎక్కడో అమ్మేశాడని బాధితుడు ఆదివారం రూరల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. మదనపల్లె మండలం కొండామారిపల్లె పంచాయ తీ బాలాజినగర్‌లో ఉంటున్న శెట్టిపల్లె వెంకట్రమణ పెయింట్ పని చేస్తూ భార్యాపిల్లలను పోషించుకునేవాడు. సంపాధన చాలకపోవడంతో భార్య రాధ(35)ను కువైట్ పం పించాలని అనుకున్నాడు.
పాస్‌పోర్టు కూడా తీసుకున్నాడు. క్రిష్ణానగర్‌లో ఉంటున్న ఏజెంట్ రెడ్డిబాషాను ఆశ్రయించాడు. అతను త్వరలో గల్ప్ నుంచి వీసా తెప్పించి కువైట్‌కు పంపుతానని వెంకటరమణకు హామీ ఇచ్చాడు. మూడు రోజుల క్రితం రాధ కనిపించకుండా పోయింది. ఏజెంట్ రెడ్డి బాషా తన ఇంటికి కొంతకాలంగా వస్తూ పోతూ ఉండేవాడని, అతనే తన భార్యను కువైట్ పేరుతో తీసుకెళ్లి ఎక్కడో అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు.