
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు . సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
చదవండి: షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ
ఈ నేపథ్యంలో ఎజెంట్‌ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా, అగ్ర హీరో సినిమాలతో పోటీ పడనుంది. సంక్రాంతి బరిలో ప్రభాస్-ఆదిపురుష్, మెగాస్టార్ చిరంజీవి- వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలయ్య వంటి బడా హీరోల సినిమాల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది. నిజానికి ఈ సినిమా 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి బరిలో దిగుతోంది.
Get caught upon all the ACTION 😎#Agent Arriving in theatres WorldWide this SANKRANTHI 2023 🔥 #HappyDiwali
— AK Entertainments (@AKentsOfficial) October 24, 2022
ఏజెంట్・एजेंट・ஏஜென்ட்・ഏജന്റ്・ಏಜೆಂಟ್@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic @GTelefilms pic.twitter.com/AsKXt0BqrW
Comments
Please login to add a commentAdd a comment