
కంటోన్మెంట్: దుబాయ్ వెళ్లాలని వచ్చిన ఓ అమ్మాయిపై ఏజెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ సంఘటన గోపాలపురం పోలీసుస్టేషన్ పరి«ధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేఎల్‌ఎన్ మూర్తి దుబాయ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన ఓ మహిళను దుబాయ్ పంపించే క్రమంలో గతవారం నగరానికి తీసుకొచ్చాడు. మూడురోజుల క్రితం ఇమ్మిగ్రేషన్ నిమిత్తం మూర్తి అమ్మాయితో పాటు చెన్నైకి వెళ్లాడు.
అయితే దుబాయ్ వీసా తిరస్కరణకు గురికావడంతో శనివారం తిరిగి హైద్రాబాద్‌కు వచ్చిన వీరు భార్యభర్తలుగా చెప్పుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సాయి లాడ్జీలో రూము తీసుకున్నారు. ఆదివారం ఉదయం వేళలో వారి గదిలోంచి అరుపులు, కేకలు రావడంతో లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే లాడ్జీకి చేరుకున్న పోలీసులు మూర్తితో పాటు అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment