
సాక్షి, సూర్యపేట : తెలంగాణ తొలి పంచాయితీ ఎన్నికల్లో అపశృతి చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఎన్నికల ఏజెంట్ ఒకరు గుండెపోటుతో మరణించారు. వివరాలు.. విలాస కవి సత్యం రాజు(70) సూర్యపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల గ్రామంలో ఎన్నికల ఏజెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా.. సోమవారం ఉదయం గుండెపోటు రావడం కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా దురదృష్టావషాత్తు మార్గమధ్యలోనే మరణించాడు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు ప్రక్రియ ముగియగానే సోమవారమే ఫలితాలను ప్రకటించనున్నారు. మొదటి దశలో మొత్తం 3,701 సర్పంచ్ స్థానాలకు 12,202 మంది, మొత్తం 28,976 వార్డు మెంబర్ స్థానాలకు 70,094 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment