సంక్రాంతి రేసులో పందెంకోళ్లు, సై అంటున్న అఖిల్‌ | Akhil Akkineni Agent Release Date Out | Sakshi
Sakshi News home page

Agent Movie: సంక్రాంతికి ఏజెంట్‌గా వచ్చేస్తానంటోన్న అఖిల్‌

Published Mon, Oct 24 2022 5:38 PM | Last Updated on Mon, Oct 24 2022 5:38 PM

Akhil Akkineni Agent Release Date Out - Sakshi

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్‌. స్టైలిష్‌ స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో మమ్ముట్టి ఓ ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఏజెంట్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌.

పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. కాగా సంక్రాంతి రేసులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', ప్రభాస్‌ 'ఆదిపురుష్‌', విజయ్‌ 'వారసుడు' సినిమాలున్నాయి. తాజాగా ఈ లిస్టులో అఖిల్‌ 'ఏజెంట్‌' కూడా వచ్చి చేరింది. 

చదవండి: హ్యాపీగా టాయ్‌లెట్స్‌ కడిగేవాడిని: నటుడు
నేను ఎలా ఉన్నా అందగత్తెనే: ప్రగతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement