tpcc president uttam kumar reddy
-
‘వారిని ఎందుకు ఆదుకోవడం లేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీరుతో వలస కార్మికుల జీవితాలు నాశనమయ్యాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం కాంగ్రెస్ నేతలు చేపట్టిన రైతు సంక్షేమ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. మద్యం షాపులను తెరవద్దని.. దీని వలన మరిన్ని సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. 40 రోజులు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని.. మద్యం అమ్మకాలు జరిపితే సమస్యలు మరింత జఠిలమవుతాయన్నారు. లాక్డౌన్ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వలస కార్మికులను ఆదుకోవడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు చెప్పిన ముఖ్యమంత్రి వినడం లేదన్నారు. 44 రోజుల లాక్డౌన్లో రాష్ట్రంలో వలస కార్మికులు ఎంత మంది ఉన్నారో సరైన లెక్కలు ప్రభుత్వం లేవని దుయ్యబట్టారు. వలస కార్మికులు కోసం హైదరాబాద్‌లో 400 అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టామన్నారని.. కానీ అవీ ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధికి వలస కార్మికులు దోహదపడ్డారని..వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వారు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ టిక్కెట్ ధర 50 రూపాయలు ఛార్జ్ చేస్తుందని.. వలస కార్మికుల టిక్కెట్ డబ్బులను కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని తెలిపారు. -
ఆంధ్రా ఏజెంటుగా ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రాకు ఏజెంటుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి మొదటి శత్రువు కాంగ్రెస్సే అని మరోసారి రుజువైందన్నారు. విభజన చట్టం లో ని హామీలు ఏపీకి అమలు చేస్తే అభ్యంతరం లేదని, ఆ పరిధి దాటి ముందుకెళితే ప్రతిఘటిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కష్టపడుతుంటే కాంగ్రెస్ దానికి అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎండబెట్టి ఏపీకి ప్రయోజనం చేయడమే కాంగ్రెస్ విధానమన్నారు. ఉద్యోగాల నియామకంపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. -
అమ్ముడుపోతే ఏం చేయగలం?
మనసులోమాట పాలకుల దిగజారుడుతనం, ప్యాకేజీలకు, ప్రలోభాలకు లోబడి అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యే వారి క్షీణ రాజకీయాలే ఫిరాయింపులకు ముఖ్యకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలు చూపలేం కాని పార్టీలు మారిన వారిలో ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారని.. ఏ పార్టీ తరపున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయిందన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే వారికి అమ్ముడుపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఫిరాయింపుల నిరోధక చట్టం ఇంత నిర్వీర్యమైపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని భయమేస్తుందని చెప్పారు. ప్రజలు దేన్నయినా సహిస్తారు కానీ పాలకుల అహంకారాన్ని, అమానవీయ దృక్పథాన్ని సహించరంటున్న ఉత్తమ్ కుమార్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాజకీయాల్లోకి రాకముందు మీ హోదాల గురించి చెబుతారా? నేను 16 సంవత్సరాల వయస్సులోనే పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందాను. భారతీయ వాయుసేనలో పైలట్ ఆఫీసర్‌గా క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా చేరాను. అధునాతన టెక్నాలజీ కలిగిన విమాన పైలట్‌గా పనిచేయడంతో పూర్తి సంతృప్తి పొందాను. బోర్డర్ సమీపంలో ఫ్లైయింగ్ చేస్తున్నప్పుడు విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలట్ విమానం. విమానంలో నేను కూర్చుని ఉండగానే పేలిపోయింది. అయితే యుద్ధవిమానంలో ఎజెక్షన్ అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్‌తో సహా పైలట్‌ను బయటకు షూట్ చేస్తుంది. దాంతో పారాచూట్ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డాను. తర్వాత రష్యన్ వైమానిక నిపుణులు వచ్చి చూశారు. ఇలాంటి ప్రమాద ఘటనల్లో పది లక్షల్లో ఒకరు కూడా బతికి బయటపడటం కష్టం. నీకు ఇది బోనస్ జీవితం అనుకో అన్నారు వారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక విరిగింది. మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆసుపత్రిలో ఉండి కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. ఆ తర్వాత కూడా కొంత కాలం పైలట్ గానే పనిచేశాను. అయితే మళ్లీ ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే వెన్నెముక పూర్తిగా డామేజ్ అవుతుంది కాబట్టి, పైలట్ బాధ్యతల నుంచి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని రష్యన్ నిపుణులు సూచించారు. దాంతో ఎయిర్ చీఫ్ మార్షల్ నాటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్‌ను సంప్రదించి పీస్ పోస్టింగ్ –రిస్క్ లేని ఉద్యోగం–లో భాగంగా ఆయన వద్ద ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నా మిలిటరీ హోదాను ఐఏఎస్ హోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారు. ఎంపీలు కూడా ఫిరాయించడానికి ప్రాతిపదిక ఏంటి? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎవరైనా కావచ్చు మరోపార్టీకి అమ్ముడుపోతే, అమ్ముడు పోదల్చుకుంటే మనం ఏం చేయగలం? సుఖేందర్ గుప్తా ఎందుకు అమ్ముడు పోయారు అంటే ఏం చెప్తాం. ఒకటి మాత్రం నిజం. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆరే. కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మేం ఊహించలేదు. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారు. గుప్తాకు, ఆయన కుటుంబానికి కూడా ప్యాకేజీలు వచ్చాయి. కావాలంటే ఆ టెండర్ కాపీలు మీకు పంపుతాను. ఇంతస్థాయిలో పార్టీ మార్పిడి కార్యక్రమం జరగడానికి రెండే రెండు కారణాలు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు, అమ్ముడుపోవడానికి సిద్ధమైన వారి రాజకీయాలు. కానీ అన్నిపరిణామాలను ప్రజలు చూస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని నా నమ్మకం. పార్టీ మారితే రాజీనామా చేస్తే బాగుండేది కదా? ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ దేశంలో అమలే కాకుంటే, భవిష్యత్తులో ఏం జరుగబోతుంది అనేది భయపెడుతోంది. తెలంగాణా టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే, వారిలో 12 మంది పార్టీనుంచి ఫిరాయిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏమి అర్థమున్నట్లు? పార్టీ సింబల్‌కి ఏమి అర్థం? ఏ పార్టీ తరఫున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దానికి అమ్ముడుపోతున్నారు. 24 గంటల విద్యుత్ క్రెడిట్ కేసీఆర్‌దా లేక కాంగ్రెస్‌దా? రెండో ప్రపంచయుద్ధ కాలంలో గోబెల్స్ అనే మంత్రి.. జర్మనీ గెలవబోతోంది అంటూ ఎప్పుడూ ఒకే ప్రచారం చేసేవాడు. ఆ ప్రచారాన్ని హిట్లర్ అంతటివాడు కూడా చచ్చేంతవరకు నమ్మాడు. అలాగే కేసీఆర్ తప్పుడు ప్రచారంతో, మీడియాలో వందలకోట్లు ప్రకటనలకు తగిలేసి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో విద్యుత్ మిగులు ఉంది కాబట్టి 24 గంటలేమిటి ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు. ఎరువుల కోసం రూ. 4 వేలు ఇస్తే, రైతులంతా సంతృప్తి చెందుతారా? స్వాంతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో ఎక్కువమంది రైతుల ఆత్మహత్యలు జరిగింది కేసీఆర్ పాలిస్తున్న తెలంగాణలోనే అని గుర్తుంచుకోవాలి. మిర్చిపంటకు మంచి ధర కావాలని ఖమ్మం రైతులు వీధుల్లోకొస్తే వాళ్ల కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి మరీ జైల్లో కుక్కించిన దుర్మార్గ పాలన కేసీఆర్‌ది. రైతులను సంకెళ్లతో రోడ్డు మీద నడిపించారు. కేసులు పెట్టారు. రైతులను నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసి వాళ్లు వాతపెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసి ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు జిమ్మిక్కులకు సిద్ధమవుతున్నాడు కేసీఆర్. మిషన్ భగీరథ పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు కదా? మిషన్ భగీరథలో ఆరు శాతం కమీషన్ గ్యారంటీ. అందుకే అది కమీషన్ భగీరథ. నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్నారు కదా. అయితే దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానన్నారు. ఇవ్వలేదు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు. చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. మరి వీళ్లెవరినీ ఓట్లడగొద్దు. తెలంగాణ ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం జరగనుంది చూస్తూ ఉండండి. ప్రజలు సహించని విషయం ఏమిటంటే అహంకారం. తెలంగాణను పాలిస్తున్న వాళ్లు కళ్లు నెత్తికెక్కి, చిన్నా, పెద్దా, మంచీ చెడూ, డిగ్నిటీ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కొడుకు నియోజకవర్గంలో దళితులను తీసుకుపోయి పోలీస్ టార్చర్ చేస్తే కనీసం దానిమీద చర్యలుండవు. అంటే ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జగ్జీవన్ రాం బిడ్డ మీరా కుమార్ తెలంగాణకు వచ్చి వారిని చూసి కంట తడిపెడితే వీళ్లు హేళన చేస్తూ మాట్లాడతారు. ఉస్మానియాలో బీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీస పరామర్శ కూడా ఉండదు. కామారెడ్డిలో బీసీకి చెందిన వీఆర్ఎను ఇసుక ట్రాక్టర్ కింద తొక్కించి చంపితే వీళ్లు పట్టించుకోరు. ఇదా వీరి పాలన. ఇంత అమానవీయం, ఇంత అహంకారం ఎన్నడైనా చూశామా.. వీళ్లను ప్రజలు తరిమి తరిమి కొడతారు చూస్తూ ఉండండి. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయనకు మా శుభాకాంక్షలు. -
'జీవితాంతం ఉత్తమ్ గడ్డంతో ఉండాల్సిందే'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాల ప్రచారం చేయడంలో దిట్ట అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు. అధికారం లేకపోయే సరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై అబద్దాలను మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు. బుధవారమిక్కడ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యమున్న అంశాలను అసెంబ్లీలో చర్చించలేదని ఉత్తమ్ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తమ్ ప్రజా వ్యతిరేకిగా మాట్లాడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిందని చెప్పారు. పేదల గృహ రుణాలు 3600 కోట్లు మాపీ చేయడం ప్రాధాన్యతా అంశం కాదా? మైనారిటీలకు చేయూత నివ్వడం, రైతులకు భరోసా ఇవ్వడం ముఖ్యమైన అంశాలు కాదా అని ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు గడ్డం తీయబోనని ఉత్తం చెబుతున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే ఉత్తమ్ జీవితాంతం గడ్డంతో ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ హిమాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన చెప్పారు. -
టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాలిబండ: ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి మోసం చేసిన టీఆర్ఎస్కు ముస్లిం మైనార్టీలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పురానాపూల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్‌తో కలిసి పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకు ఓటు వేయాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ నాయకులు కళ్లబొల్లి మాటలతో ముస్లిం మైనార్టీలను దగా చేస్తున్నారన్నారు. మజ్లీస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న బీజేపీ దేశంలో ముస్లింలకు రక్షణ లేకుండా చేస్తుందన్నారు. మైనార్టీ యువకులను ఎన్కౌంటర్ పేరుతో హతమారుస్తున్నా మజ్లిస్ నేతలు నోరు మెదపడం లే దన్నారు. పాతబస్తీలోని 12 డివిజన్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాతబస్తీలో తమ ప్రచారానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక మజ్లీస్ నేతలు తమ కార్యకర్తలు, నాయకులను బెదిరిస్తున్నారన్నారు. తమ కార్యకర్తలకు హాని జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ... హైదరాబాద్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రౌడీలతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు తన కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమను ఎన్నికల్లో ఎదుర్కోవాలన్నారు. -
యువతను మోసగించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ తెలంగాణ యువతలో కలలు పెంచి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. వారిని నిలువునా మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం.అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు ఆర్.సి.కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం, యువతకు ఉపాధికల్పన అని ఊదరగొట్టిన కేసీఆర్... ఇప్పటిదాకా ఒక్కరికీ ఉద్యోగాన్ని, ఉపాధినీ కల్పించలేదని విమర్శించారు. కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడి యువత భవితను మార్చాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్‌పై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ కుటుంబ అరాచకాలపై, అవినీతిపై యువత పోరాడాలని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లేసిన యువత ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉందని... కాంగ్రెస్ భావజాలాన్ని, యువత పట్ల అంకితభావాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని జానారెడ్డి సూచించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ... పార్టీ అగ్రనేతల సహకారంతో ప్రభుత్వాలపై పోరాడతానని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యన్నారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, డీకే అరుణ, గీతారెడ్డి, బలరాం నాయక్, మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మాజీ యువజన నేత ఎక్కడ? యువజన కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్‌కుమార్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఓడిపోయిన రవికుమార్ యాదవ్, ఆయన ప్యానెల్లో గెలిచిన రాష్ట్ర కార్యవర్గంలోని నేతలు కూడా పాల్గొనలేదు. అయితే యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకారం సంగతి తనకు తెలియదని, తనను ఆహ్వానించలేదని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. -
రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో నిలదీస్తాం
కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి * మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి * ప్రభుత్వం తప్పించుకోవాలని చూడడం సరికాదు * రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: ఉత్తమ్ నారాయణఖేడ్ రూరల్: అన్నదాతల ఆత్మహత్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌కు ఆదివారం వచ్చిన ఆయన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నందున ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, సాగులో నష్టాల కారణంగా రైతు ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. 1997 నుంచి 2004 వరకు రైతు ఆత్మహత్యలు కొనసాగడంవల్ల అనంతరం వచ్చిన తమ ప్రభుత్వం విద్యుత్, విత్తనాలు, ఎరువుల సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. రూ.1,300 కోట్లు మాఫీచేసి రైతులకు ఊరట కలిగించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అట్టహాసాలు, ప్రదర్శనలు, అధికార పటాటోపం తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ లింబయ్య మరణంపై ప్రభుత్వం వాద ప్రతివాదనలకు పోకుండా ఆదుకోవాలన్నారు. రైతు ఆత్మహత్యలపై కమిటీల ద్వారా పరిశీలించి సత్యాసత్యాలు నిర్ధారించి బయటపెట్టాలని తెలిపారు. ప్రతీదానికి తప్పించుకోజూడటం సరికాదని ప్రభుత్వానికి హితవుపలికారు. కలసికట్టుగా పనిచేయాలి భేదాభిప్రాయాలు విడనాడి కాంగ్రెస్ గెలుపు కోసం కలసికట్టుగా పాటుపడాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి పిలుపునిచ్చారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి సంతాప సభను ఆదివారం నారాయణ ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ్, జానా మాట్లాడుతూ, భేదాభిప్రాయాలున్నా మాజీ ఎంపీ సురేశ్ షెట్కర్, కిష్టారెడ్డిలు పార్టీ శ్రేయస్సు కోసం కలసి పనిచేశారన్నారు. ఏదైనా ప్రభుత్వ పథకానికి కిష్టారెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో అడుగుతామన్నారు. సురేష్ షెట్కర్ మాట్లాడుతూ... వైఎస్ అప్పట్లో తనను, కిష్టారెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడి ఒక్కటి చేశారన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను పార్లమెంట్ స్థానానికి, కిష్టారెడ్డిని అసెంబ్లీకి పోటీచేయించి కాంగ్రెస్ గెలిచేలా పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కిష్టారెడ్డి కుమారులు సంజీవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. రైతులను వేధిస్తే కేసులు: ఉత్తమ్ బలవంతపు వసూళ్లతో రైతులను వేధింపులకు గురిచేసే ప్రైవేట్ వడ్డీవ్యాపారులపై ప్రభుత్వం కేసులు నమోదు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. మరణించిన రైతుల సంఖ్యను ప్రభుత్వం తగ్గించి చెప్పడం, ఆత్మహత్యలను దాచడానికి ప్రయత్నించడం సరికాదని ఉత్తమ్ అన్నారు. -
జీతగాళ్లు దొరకని తెలంగాణ కావాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీతగాళ్లు కావాలంటే దొరకని పరిస్థితి రావాలని పలువురు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఆకాంక్షించారు. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, విద్య వంటి వాటిలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్య, ఉపాధి రంగాల్లో హామీలు- నిర్లక్ష్యం’ అంశంపై శనివారమిక్కడి గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్యర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, భాగ్య నాయక్, రమేశ్ రెడ్డి, పి.ఎల్.విశ్వేశ్వర్రావు, కె.నాగేశ్వర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చేశారు. కాషాయీకరణకు బీజేపీ కుట్ర: కంచె ఐలయ్య కార్పొరేట్ విద్యకు పెద్దపీట వేసి పేదలకు విద్యను దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. విద్యను కాషాయీకరణ చేసే దురాలోచనలో ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 6 వేల పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ప్రజలంతా ఇంగ్లిష్ విద్యను చదువుకుంటే కేసీఆర్‌కు, దొరలకు జీతగాళ్లు దొరకరనే భయం ఉంది. చరిత్రను వక్రీకరిస్తున్నారు: ప్రొ. భాగ్య నాయక్ చరిత్రను కేంద్రం వక్రీకరిస్తోంది. పుష్కరాలకోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం టీచర్లను నియమించలేకపోతోంది. నిర్బంధ విద్య అమలు చేయాలి: విశ్వేశ్వరరావు ప్రతీ వ్యక్తికి ఉచితంగా నిర్బంధ విద్యను అమలుచేయాలి. రాష్ట్రంలో విద్యావిధానం వల్ల పేదలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. 22 వేల పాఠశాలల్లో మంచినీటి సౌకర్యంలేదు.. 12వేల బడుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది. విద్య, ఉద్యోగాలపై శ్వేతపత్రం: కె.నాగేశ్వర్ విద్య, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలున్నా వాటిని భర్తీచేయడం లేదు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలి. సమావేశంలో చేసిన తీర్మానాలు.. ⇒ కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలి. ⇒ రీయింబర్సుమెంటు పూర్తిస్థాయిలో ఇవ్వాలి. ⇒ జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావాలి. ⇒ విద్య కాషాయీకరణ ప్రయత్నాలు ఆపాలి. -
రాహుల్.. ఓయూకు రండి
ఏఐసీసీ ఉపాధ్యక్షుడిని కలసి ఓయూ జేఏసీ విన్నపం సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే తెలంగాణ ఆత్మగౌరవ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఓయూ జేఏసీ నేతలు ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం వారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ వచ్చినా ప్రజలు సంతృప్తిగా లేరని, ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని వివరించారు. ఈ ప్రతిని ధి బృందంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు కైలాష్ నేత, దరువు ఎల్లన్న, మానవతారాయ్, విజయ్‌కుమార్, చరణ్, నాగెల్లి వెంక టేష్‌గౌడ్, లోకేష్‌యాదవ్ తదితరులు ఉన్నారు. తమ ఆహ్వానానికి రాహుల్‌గాంధీ సానుకూలంగా స్పందించినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఆయనొస్తున్నారనే... రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారనే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘ఓయూ, కేయూ, తెలంగాణ యూనివర్సిటీలకు వీసీలు లేరు. సిబ్బంది సరిపడాలేరు. విద్యార్థులు నిరాశలో ఉన్నారు. రాహుల్ ఇక్కడికి వస్తున్నారంటేనే ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పందిస్తోంది. ఆయన రాక విద్యార్థులకు, యువతకు మేలు జరుగుతుందని మేం భావిస్తున్నాం.’ అని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో లక్షా 50 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని, బోధన ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ 27న హైదరాబాద్, 28న వరంగల్‌లో పర్యటిస్తారని, వరంగల్‌లో బొగ్గు గని కార్మికులతో మాట్లాడతారని వివరించారు. -
ప్రజాహితమా.. కమీషన్ల కక్కుర్తా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రాణహిత’లో ప్రాణం లేకుండా చేసేవిధంగా డిజైను మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కమీషన్ల కక్కుర్తే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో బుధవారం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏకపక్ష నిర్ణయాలతో ప్రతిపక్షాన్ని, మీడియాను, నిపుణులను, మేధావులను పట్టించుకోవడంలేదన్నారు. కమీషన్లు, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచిది కాదని ఉత్తమ్ హెచ్చరించారు. ప్రాణహిత ప్రాజెక్టు డిజైను మార్పు విషయంలో ఇప్పటికే నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. డిజైను మార్చడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటూ కొన్ని స్వచ్ఛందసంస్థలు, రిటైర్డు ఇంజనీర్లు వాదిస్తున్నారని ఉత్తమ్ చెప్పారు. ప్రాణహిత డిజైను మార్పుపై టీపీసీసీ వైఖరిని ప్రకటించడానికి ముందు సాగునీటిరంగ నిపుణులతో లోతుగా చర్చిస్తామని వెల్లడించారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టుల డిజైన్లను ఎవరికివారే ఇష్టం వచ్చినట్టుగా మారిస్తే అంతిమంగా ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందని ఉత్తమ్ హెచ్చరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పనిని పూర్తిచేయాలనే అంశం కంటే సెంటిమెంటును రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్టులపై గాంధీభవన్‌లో గురువారం నిపుణులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. వీటితో పాటు గ్రామీణ ఉపాధిహామీ పథకానికి పనిదినాలను తగ్గించడంపై ఈ నెల 25న చర్చిస్తామన్నారు. వీటికి ఏఐసీసీ నేతలు కొప్పుల రాజు, ఆర్.సి.కుంతియాతో పాటు టీపీసీసీ నేతలు హాజరవుతారన్నారు. -
ముస్లిం సోదరులను చంపితే దిక్కేలేదు..
సొంత పోలీసులతో కేసీఆర్ విచారణ: ఉత్తమ్ సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో ఒకేసారి ఐదుగురు ముస్లిం సోదరులను చంపితే దిక్కులేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వరంగల్ లోక్‌సభ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం హన్మకొండలో వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల సమావేశం జరిగింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ రహదారిపై పట్టపగలు వికారుద్దీన్ సహా ఐదుగురిని కాల్చి చంపారని.. ఈ సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని తాము సీఎంను కోరినా పట్టించుకోలేదన్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులతోనే.. దీనిపై విచారణ జరిపించడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్నారు. కడియం కులం ఏమిటో విచారణ జరపాలి : సర్వే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కులం ఏమిటో సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కోరారు. దేశంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన వారికి శిక్షలు పడ్డాయని.. విచారణ జరిపి దోషిగా తేలితే చట్టప్రకారం శ్రీహరికి శిక్షపడాలని వ్యాఖ్యానించారు. -
టీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకుందాం
సాక్షి,హైదరాబాద్ : అధికార పార్టీ అదిరింపులు,బెదిరింపులకు భయపడకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం అంబర్‌పేటలో సీఎల్పీ నేత జానారెడ్డి,ఖైరతాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి , ఉప్పల్‌లో మాజీ టీపీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య, కుత్బుల్లాపూర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ భట్టి విక్రమార్క, సనత్‌నగర్‌లో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి, ఉత్తమ్కుమారెడ్డిలు మాట్లాడుతూ ఏడాది పాలనలో కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు ప్రజల ఎజెండాను పూర్తిగా విస్మరించాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించాయని జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదేం స్వచ్ఛ హైదరాబాద్... ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రు లు షబ్బీర్ అలీ, దానం నాగేందర్ ఆదివారం ఖైరతాబాద్ నియోకజవర్గంలోని సీఎం కేసీఆర్ ని వాస పరిసరాల్లో పర్యటించి స్వ చ్ఛ హైదరాబాద్ పరిస్థితిని తెలుసుకున్నారు. నందినగర్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పరిశీలిస్తూ సీఎం నివాసం సమీపంలోనే స్వచ్ఛ హైదరాబాద్ ఇలా ఉందని, ఆ పేరిట ఇలా చెత్త హైదరాబాద్‌ను తయారు చేశారని మండిపడ్డారు. జీహె చ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ము ఖ్య నేతలంతా నగరంలోని నియోకజవర్గాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, డీకే అరుణ పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఏమైంది?
- లక్షన్నర ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఏవీ? - సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్‌కుమార్ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఇంటికో ఉద్యోగం ఇస్తామని అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ కావాలన్న కేసీఆర్ ..సీఎంగా ఏం చేస్తున్నాడని నిలదీశారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగమిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ 10 నెలల్లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చాడన్నారు. ఈ 10 నెలల్లో ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికో ఉద్యోగం కూడా రాలేదన్నారు. ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో 1,07,722 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాస్తవానికి లక్షన్నర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. మండలి ఎన్నికలు ప్రతిష్టాత్మకం: శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. పార్టీ అనుబంధసంఘాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గెలుపు సాధ్యమన్నారు. వ్యూహాత్మకంగా ఉంటే గెలుస్తాం.. శాసనమండలి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తే గెలుస్తామని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ముఖ్యులతో గాంధీభవన్‌లో వీరు సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంతో పట్టభద్రుల్లో అసంతృప్తి నెల కొందన్నారు. ఈ ఎన్నికల్లో పనిచేస్తే.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఉపయోగపడుతుందన్నారు.