టీఆర్‌ఎస్ ఆగడాలను అడ్డుకుందాం
సాక్షి,హైదరాబాద్ : అధికార పార్టీ అదిరింపులు,బెదిరింపులకు భయపడకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం అంబర్‌పేటలో సీఎల్పీ నేత జానారెడ్డి,ఖైరతాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి , ఉప్పల్‌లో మాజీ టీపీసీసీ నేత పొన్నాల లక్ష్మయ్య, కుత్బుల్లాపూర్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్ భట్టి విక్రమార్క, సనత్‌నగర్‌లో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జానారెడ్డి, ఉత్తమ్‌కుమారెడ్డిలు మాట్లాడుతూ ఏడాది పాలనలో కేంద్రంలో ఎన్‌డీయే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీలు ప్రజల ఎజెండాను పూర్తిగా విస్మరించాయన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించాయని జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదేం స్వచ్ఛ హైదరాబాద్... ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రు లు షబ్బీర్ అలీ, దానం నాగేందర్ ఆదివారం ఖైరతాబాద్ నియోకజవర్గంలోని సీఎం కేసీఆర్ ని వాస పరిసరాల్లో పర్యటించి స్వ చ్ఛ హైదరాబాద్ పరిస్థితిని తెలుసుకున్నారు. నందినగర్‌లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పరిశీలిస్తూ సీఎం నివాసం సమీపంలోనే స్వచ్ఛ హైదరాబాద్ ఇలా ఉందని, ఆ పేరిట ఇలా చెత్త హైదరాబాద్‌ను తయారు చేశారని మండిపడ్డారు. జీహె చ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ము ఖ్య నేతలంతా నగరంలోని నియోకజవర్గాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, డీకే అరుణ పాల్గొన్నారు.