సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మోకాళ్లపై యాత్ర చేసినా తెలంగాణలో టీడీపీకి పుట్టగతులుండవని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ఇంద్రవెల్లి దాకా పాదయాత్ర చేస్తానని ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు.
సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో కర్నె విలేకరులతో మాట్లాడుతూ, టీటీడీపీ నాయకులు అలీబాబా అరడజను దొంగల్లా మారారని, మహానాడు సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా నేతలకు తాకట్టు పెట్టారన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చంద్రబాబు ద్రోహం చేశారని, ఆయన నిర్వాకం వల్లే ఆ జిల్లా నుంచి లక్షలాది మంది వలసలు వెళ్లారని ఆరోపించారు.
టీడీపీకి పుట్టగతులుండవు: కర్నె
Published Tue, May 31 2016 3:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement