
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకమైన మలుపు తిప్పిన రోజు కేసీఆర్ ఆమ రణ నిరాహార దీక్ష చేపట్టిన 2009 నవంబర్ 29వ తేదీ.

‘కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో’నని నినదించి 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరాలకు మరల్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రగా నిలిచారు

కట్టలు తెగుతున్న ప్రజాగ్రహాన్నీ, ప్రజాసంఘాల పటు త్వాన్నీ రాజకీయ ప్రక్రియగా మరల్చి, కేంద్రం మెడలు వంచి స్వరాష్ట్ర లక్ష్యం నెరవేర్చిన ఆయన సంకల్ప దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.













