
సాక్షి, అమరావతి: తమ కుటుంబానికి ప్రధానంగా హెరిటేజ్ నుంచే ఆదాయం వస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన తమ కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు. తన తండ్రి, సీఎం చంద్రబాబు ఆస్తుల్లో పెద్దగా మార్పుల్లేవని ఆయన చెప్పారు. తన తండ్రికి రూ. 4 కోట్ల విలువైన స్తిరాస్థి ఉండగా, రూ. 3.58 కోట్ల అప్పులు ఉన్నాయని అని వెల్లడించారు.
మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ వస్తుందన్నారు. హైదరాబాద్‌లో తమకు ఉన్న ఇల్లు కూల్చి కొత్తది కట్టామని, దీనికి రూ. 4 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) రూ. 30 లక్షలు పెరిగిందని, బ్యాంకు రుణాలు రూ. 5 కోట్లకు పెరిగాయని తెలిపారు. తమపై ఆరోపణలు చేసేవారు ముందుగా వారి ఆస్తులు ప్రకటించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
లోకేశ్ ప్రకటించిన ఆస్తుల వివరాలు
- చంద్రబాబు నికర ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లు
- భువనేశ్వరి నికర ఆస్తుల విలువ రూ. 25 కోట్లు
- లోకేశ్ ఆస్తులు రూ.15.20 కోట్లు
- బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్లు
- దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.11.54 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment