
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖల ఆస్తుల వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి సామాన్య ప్రజల్లో ఉండటం సహజమే. అదే తనను చాయ్‌వాలాగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ గురించి అయితే ఆసక్తి మరి ఎక్కువగా ఉంటుంది. అయితే తాజాగా పీఎంవో మోదీ ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించింది. మార్చి 31,2018 వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ వివరాలను వెల్లడించింది. మోదీ ఆస్తుల విలువ రెండున్నర కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉన్నట్టు పీఎంవో పేర్కొంది. వివిధ బ్యాంకుల్లో కోటి రూపాయల నగదు ఉండగా.. మోదీ వద్ద 50వేల రూపాయల నగదు ఉన్నట్టు పేర్కొంది. మోదీకి సొంతంగా ఒక కారు గానీ, బైకు గానీ లేవని తెలిపింది. అలాగే ఆయన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని స్పష్టం చేసింది.
పీఎంవో వెల్లడించిన వివరాలు:
మోదీ వద్ద ఉన్న నగదు- రూ. 48,944
గాంధీనగర్ స్టేట్ బ్యాంక్‌లో డిపాజిట్- రూ.11,29,690
మరో ఎస్బీఐ అకౌంట్‌లో- రూ.1,07,96,288
ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రా బాండ్(ప్రస్తుత విలువ)- రూ. 20,000
జాతీయ పొదుపు పత్రం బాండ్ విలువ- రూ. 5,18,235
జీవిత బీమా పాలసీ- రూ. 1,59,281
మోదీ వద్ద ఉన్న బంగారం విలువ(కేవలం 4 ఉంగరాలు) - రూ.1,38,060
స్థిరాస్తుల విషయానికి వస్తే.. గాంధీనగర్‌లోని ఓ నివాస గృహంలో మోదీకి నాలుగో వంతు వాటా ఉంది. దీనిని ఆయన 2002లో 1,30,488 రూపాయలకు కొనుగోలు చేశారు. తర్వాత దానిపై 2,47,208 రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దాని విలువ కోటి రూపాయలు ఉన్నట్టు పీఎంవో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment