రెండవ భార్య కొడుకు కోసమే..
బలియా(ఉత్తరప్రదేశ్): సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మయావతి ఆరోపించింది. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ పోటి చేస్తున్న ఆజమ్ ఘర్, మెయిన్ పురి లోకసభ స్థానం నుంచి పోటి చేయడంపై రాజకీయంగా రచ్చ రచ్చ జరుగుతోంది.
ఓటమి భయంతోనే అనేక రూమర్లు సృష్టిస్తున్నారని మయావతి విమర్శించారు. మెయిన్ పూరి లో ములాయం గెలిస్తే ఆజమ్ ఘఢ్ స్థానాన్ని వదులుకుంటారని, ఈ నియోజకవర్గంలో వ్యక్తిని కాకుండా ఆయన కుటుంబ సభ్యుడినే పోటికి పెడుతారని మయావతి అన్నారు.
తన రెండవ భార్యను బుజ్జగించడానికి..వారి కుమారుడు ప్రతీక్ యాదవ్ కు ఆజమ్ ఘడ్ సీటును కట్టబెట్టేందుకు ములాయం ప్రయత్నిస్తున్నారని మాయవతి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాజ్ వాదీ దుర్వినియోగం చేస్తున్నారని మయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.