బాబాయ్-అబ్బాయ్ గొడవ ఓ నాటకం | Mayawati advises Mulayam to retire | Sakshi
Sakshi News home page

బాబాయ్-అబ్బాయ్ గొడవ ఓ నాటకం

Published Thu, Sep 15 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

బాబాయ్-అబ్బాయ్ గొడవ ఓ నాటకం

బాబాయ్-అబ్బాయ్ గొడవ ఓ నాటకం

లక్నో: సమాజ్వాదీ పార్టీ చీఫ్‌ ములయాం సింగ్ యాదవ్ కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్యపోరు ఓ రాజకీయ డ్రామా అని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ములయాంపై కొడుకు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తిరుగుబాటు చేయడం నిజమైతే ఆయన క్రీయాశీల రాజకీయాల నుంచి వైదొలగి సన్యాసం తీసుకోవాలని మాయావతి సలహా ఇచ్చారు.

అఖిలేష్‌కు, ఆయన బాబాయ్, యూపీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్కు మధ్య జరుగుతున్న గొడవ ఓ నాటకమని మాయావతి అభివర్ణించారు. అఖిలేష్ను మిస్టర్ క్లీన్గా చూపించే ప్రయత్నంలో భాగంగా ములయాం కుటుంబంలో విభేదాలున్నట్టు చూపుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఇదంతా నిజమే అయితే ములయాం వెంటనే రాజకీయాల నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ములయాంకు అఖిలేష్పై ఉన్న పుత్రప్రేమ యూపీ ప్రజలపై లేదని ఆరోపించారు. కాగా మాయావతి ఆరోపణలను శివపాల్ ఖండించారు. ఆమె సలహాలు తమకు అక్కర్లేదని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement