ములాయంను తప్పుపట్టిన మోడీ!
ఇటా(ఉత్తరప్రదేశ్): సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మండిపడ్డారు. రేపిస్టులకు మద్దతుగా నిలువడంపై ములాయంను మోడీ తప్పుపట్టారు. రేపిస్టులపై ములాయం సానుభూతి చూపిస్తున్నారని.. అయితే రేపిస్టులపై తమది కఠిన వైఖరి అని మోడీ తెలిపారు.
కొందరు నేతలు ఏనుగు బొమ్మలతో పార్కులు నిర్మిస్తున్నారని.. మరికొందరు సింహాల సఫారీలు చేస్తున్నారని మయావతిపై మోడీ పరోక్ష విమర్శలు చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి ములాయం, మయావతిలకు సమయం లేదని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అబ్బాయిల తప్పులు చేయడం సహజమని.. అంత మాత్రాన రేప్ కేసు నిందితులకు ఉరి విధిస్తారా అంటూ ములాయం ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.