రెండో భార్యకోసమే ములాయం పోటీ: మాయ | mulayam singh yadav participated for his second wife | Sakshi
Sakshi News home page

రెండో భార్యకోసమే ములాయం పోటీ: మాయ

Published Sun, May 4 2014 4:03 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

రెండో భార్యకోసమే ములాయం పోటీ: మాయ - Sakshi

రెండో భార్యకోసమే ములాయం పోటీ: మాయ

అజంగఢ్: తన రెండో భార్య కోసమే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఆమె శనివారమిక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ములాయం కుటుంబంలో వివాదం నడుస్తోందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో తన రెండో భార్యను ఆనందపరిచేందుకు, తద్వారా వారి కుమారుడు ప్రతీక్ యాదవ్‌కు మార్గం సుగమం చేసేందుకు ములాయం ... అజంగఢ్ స్థానం నుంచి పోటీకి దిగారని మాయావతి తీవ్ర ఆరోపణ చేశారు. తనను యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మేనత్తగా సంబోధించడంపై ఆమె మండిపడ్డారు. అతన్ని(అఖిలేష్‌ను) కనీసం తన చిన్న సోదరునిగా భావించడాన్ని సైతం అవమానకరంగానే పరిగణిస్తానని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement