ములాయంకు హెచ్చరికతో సరి!
న్యూఢిల్లీ: స్కూల్ టీచర్లను బెదిరించిన అంశంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికతో వదిలిపెట్టింది. ఇకపై తన ఎన్నికల ప్రచారంలో శిక్షామిత్రల(ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన కాంట్రాక్టు టీచర్లు) ప్రస్తావన తీసుకురానని ఆయన హామీ ఇవ్వడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
‘‘ములాయం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారణకు వచ్చాం. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని ఆయన్ను హెచ్చరిస్తున్నాం. ఇకపై ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘించి ఎలాంటి ప్రకటనలూ ఆయన చేయరని భావిస్తున్నాం’’ అని ఈసీ శుక్రవారం తన ప్రకటనలో పేర్కొంది.