ఆజంగఢ్ : ఓ గ్రామ పెద్ద హత్య ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ జిల్లాలో హింసకు దారి తీసింది. హత్యకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసుపై దాడికి దిగి వాహనాలను తగులబెట్టారు. ఆందోళనకారులను అదుపు చేయడం కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఆజంగఢ్ జిల్లాలోని ఓ గ్రామ పెద్ద సత్యమేవ్ జయతే అలియాస్ పప్పురామ్‌ను శుక్రవారం ఓ దుండగుడు తుపాకితో కాల్చి చంపాడు. అనంతరం ఈ విషయాన్ని పప్పురామ్ ఇంటికి వెళ్లి తెలియజేశాడు. ఈ సంఘటన తెలిసి ఆగ్రహించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వాహనాలను తగులబెట్టారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేయడంతో పాటు బారికేడ్లను తగులబెట్టారు.
(చదవండి : కుప్పకూలిన విమానం; ఐదుగురు మృతి)
పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో భారీగా పోలీసులు బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నాయి. కాగా, ఈ అల్లర్లలో ఓ చిన్నారి కూడా మృతి చెందాడు. దాడులకు పాల్పడేవారిని వెంటనే అరెస్ట్ చేసి పరిస్థితి అదుపులోకి తీసుకోవాలని పోలీసులు అధికారులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. అలాగే మృతి చెందిన గ్రామ పెద్ద, చిన్నారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అల్లర్లకు కారణమైన పోలీసులు సస్పెండ్ చేయాలని అధికారును ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment