ఆజంగఢ్ : కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు జోరందుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడడంతో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసులు కొన్ని చోట్ల సమస్యాత్మకంగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 12వ తరగతి విద్యార్థులకు వాట్సప్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయుడికి షాకింగ్ సంఘటన ఎదురైంది. ఆన్‌లైన్‌లో క్లాసులు చెబుతున్న సమయంలో వాట్సప్ గ్రూప్‌లో అసభ్య సందేశాలతో పాటు అశ్లీల వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు ఇద్దరు విద్యార్థులు. దీంతో కంగుతున్న ఉపాధ్యాయుడు గ్రూప్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి : యోగా కోసం వెళితే.. శృంగారం చేయాలని..)
ఎలా జరిగిందంటే..
ఆజంగఢ్‌కు చెందిన ఓ ప్రైవేట్ టీచర్ 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఇంగ్లీష్ క్లాసులు చెప్పాలనుకున్నారు. దీని కోసం ఓ వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసి క్లాసులు చెబుతున్నారు. గత శుక్రవారం క్లాస్ నిర్వహిస్తుండగా పదో తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు తమను కూడా గ్రూప్‌లో చేర్చమని కోరారు. గ్రూప్‌లో చేర్చిన వెంటనే ఓ విద్యార్థిని అసభ్యకర సందేశాన్ని పోస్ట్ చేసింది. అది చూసి ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని మందలించాడు. వెంటనే మరో విద్యార్థిని అశ్లీల వీడియో క్లిప్పింగ్‌ను గ్రూప్‌లో పోస్ట్ చేసింది. దీంతో కంగుతిన్న టీచర్.. వెంటనే గ్రూప్ నుంచి బయటకు వచ్చి ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థినిల తల్లిదండ్రులను పిలిపించి విచారించగా.. తమ పిల్లలు గత 15 రోజులుగా ఇంట్లో లేరని, వారికి ఫోన్లు కూడా అందుబాటులో లేవని చెప్పారు. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి ఇద్దరు విద్యార్థులు ఒకే ప్రాంతం నుంచి సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆ ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment