యూపీఏను భూస్థాపితం చేద్దాం: మోడీ | Election commission is no longer unbiased, thunders narendra Modi in Azamgarh | Sakshi

యూపీఏను భూస్థాపితం చేద్దాం: మోడీ

Published Thu, May 8 2014 1:05 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

యూపీఏను భూస్థాపితం చేద్దాం: మోడీ - Sakshi

యూపీఏను భూస్థాపితం చేద్దాం: మోడీ

అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని దేశమంతా కోరుకుంటుందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు.

అజంఘడ్ : అవినీతి కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపాలని దేశమంతా కోరుకుంటుందని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఉత్తరప్రదేశ్లోని అజంఘడ్లో ప్రసంగించారు. యూపీఏ పాలనలో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం కలగలేదని...పదేళ్లు పాలించిన అవినీతి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయని మోడీ పేర్కొన్నారు.

ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని నరేంద్ర మోడీ ఆరోపించారు. చివరి మూడు దశల ఎన్నికల్లోనూ ఈసీ పక్షపాతం చూపిందని ఆయన  వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి దేశ భవిష్యత్తును మార్చాలని బీమోడీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ను తండ్రి కొడుకులు, దేశాన్ని తల్లీ కొడుకులు నాశనం చేశారని నిప్పులు ఆయన చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement