మోడీ సభకు అనుమతివ్వాలని ఆందోళన | BJP workers protest against Election Commission in varanasi | Sakshi
Sakshi News home page

మోడీ సభకు అనుమతివ్వాలని ఆందోళన

Published Thu, May 8 2014 10:51 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మోడీ సభకు అనుమతివ్వాలని ఆందోళన - Sakshi

మోడీ సభకు అనుమతివ్వాలని ఆందోళన

వారణాసి : వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభకు అనుమతి ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు గురువారం ఆందోళనకు దిగారు. బీజేపీ ఆందోళన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. బెనారస్ హిందూ వర్సిటీ వద్ద  భద్రతా సిబ్బంది మోహరించింది. కాగా మోడీ గురువారం వారణాసిలోని బెనియాబాగ్‌లో తలపెట్టిన బహిరంగ సభకు.. మత ఘర్షణల వల్ల భద్రతా సమస్యలు తలెత్తే కారణాలరీత్యా రిటర్నింగ్ అధికారి అనుమతి నిరాకరించడం  రాజకీయ దుమారం రేపింది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఏకంగా ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢీకొనేందుకు సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ ప్రాంజల్ యాదవ్‌ను తక్షణమే తొలగించకుంటే బలప్రదర్శనకు దిగుతామనిన నిన్న అరుణ్ జైట్లీ ఈసీకి రాసిన మూడు వేర్వేరు లేఖల్లో హెచ్చరించారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement