న్యూఢిల్లీ: వారణాసిలో ఇరుగ్గా ఉండే బేమియా ప్రాంతంలో నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్త్తూ వారణాసితో పాటు నగరంలో బీజేపీ కార్యకర్తలు గురువారం నిరసన ప్రదర్శ నిర్వహించారు. ఆ పార్టీ నేతలు వెంకయ్య నాయుడు, హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు మరికొందరు స్థానిక ఎన్నికల కమిషన్ కార్యాలయం గేటు వద్ద ప్రదర్శన నిర్వహించారు. తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు కాషాయ రంగు టోపీలు ధరించి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాగా బీజేపీ నిరసన ప్రదర్శన దృష్ట్యా ఎన్నికల కమిషన్ కార్యాలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికల కమిషన్ భవనానికి దారి తీసే రహదార్లను పోలీసులు మూసివేసి, భవనం గేట్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.
నీటి ఫిరంగులతోపాటు పారామిలిటరీ బలగాలను మోహరిం చారు. ఎక్కువ మంది ఒకే చోటగుమికూడకుండా చేసేందుకుగాను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద సెక్షన్ 144ను విధించారు. బీజేపీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లకుండా ఆల్ ఇండియా రేడి యో భవనం వద్దనే అడ్డుకున్నారు. బీ.ఏపీనేతలు రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య నాయుడు నేతృత్వం లోని ప్రతినిధి బృందాన్ని మాత్రం ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లనిచ్చారు. కొందరు బీజేపీ కార్యకర్తలు బారికేడ్లకు చేధించి ముందకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారణాసిలో తంతును ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌ను తొలగించి, స్వతంత్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరామని వెంకయ్యనాయుడు ఆ తర్వాత మీడియాకు చెప్పారు.
బీజేపీ నిరసన ప్రదర్శన
Published Thu, May 8 2014 11:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement