Ram Gopal Yadav
-
CM KCR: ఏకమై ఎండగడదాం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ పార్టీలను, ఆ ప్రభుత్వాల మనుగడనే ప్రశ్నార్థకం చేసే ధోరణితో కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీన్ని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో అన్నట్టు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక ఆంక్షలు విధించి, వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించడాన్ని, ప్రభుత్వంలో చిచ్చుపెట్టి చీలికలు తేవడం ద్వారా ప్రాంతీయ పార్టీల ఉనికిని గందరగోళంలో పడేసే విధానాలను.. పార్లమెంట్ లోపలా, బయటా ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. బీజేపీ బాధిత పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ చేపడితే తప్ప దీనిని ఎదుర్కోలేమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఢిల్లీ ఉన్న సీఎం కేసీఆర్‌తో శుక్రవారం అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్‌లు భేటీ అయ్యారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ సైతం సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన భేటీలో జాతీయ రాజకీయాలు, ముఖ్యమైన ఇతర జాతీయ అంశాలపై చర్చ జరిగింది. త్రైపాక్షిక ఒప్పందాలంటూ ఆర్థిక కట్టడి విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఇటీవల రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లోకి కేంద్రం చొచ్చుకొచ్చిన తీరును ఇరువురు నేతలకు కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించుకుంటున్న సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక సాయం అందించని కేంద్రం, కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలపైనా ఆంక్షలు విధిస్తోందని చెప్పారు. రుణాలు, రుణాలపై వడ్డీలను రాష్ట్రమే చెల్లిస్తున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే లక్ష్యంతో ఎన్నడూ లేనివిధంగా త్రైపాక్షిక ఒప్పందాలంటూ కొత్త నిబంధనలు తెచ్చి ఆర్థిక కట్టడి చేస్తోందని వివరించారు. విపక్షాలు ఒక్కతాటిపైకి రావాల్సిందే.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో విఫలమై, ఉద్యోగ కల్పనలో చేతులెత్తేసి, పరిమితులకు మించి అప్పులు చేస్తున్న కేంద్రం.. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను శ్రీలంకతో పోల్చడం ఏంటనే భావనను ఎస్పీ నేతలు సైతం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రభుత్వాలను ఈడీ, సీబీఐ కేసులతో భయపెట్టడం, లేదంటే చీలికలను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టడం పరిపాటిగా మారిందని, దీన్ని ఎదుర్కోవాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. ఇటీవల మహారాష్ట్రలో చీలికలకు బీజేపీ ప్రోత్సాహం, పశ్చిమ బెంగాల్లో ఈడీ దాడులు, గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం, జార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మతపరమైన అంశాలను ఎగదోస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్న తీరుపైనా చర్చించారు. భావసారూప్య పార్టీలన్నీ ఉద్యమించాలి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తీరుపైనా నేతల మధ్య చర్చ జరిగింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు అంశాలపై చర్చను కోరుతున్న విపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేయడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయా అంశాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేయకుండా.. ప్రశ్నించే ఎంపీల గొంతు నొక్కడం అప్రజాస్వామికమని అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా విపక్షాల హక్కులను కాలరాసేలా, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బీజేపీ తీరును ప్రతి వేదికపై తిప్పికొట్టాల్సిందేనని, దీనికై భావ సారూప్య పార్టీలన్ని ఉమ్మడిగా ఉద్యమించాల్సిందేనని నేతలు నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ క్రమంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎస్పీ నేతలు చెప్పినట్లు సమాచారం. -
‘యోగి.. నువ్వేం ముఖ్యమంత్రివి?’
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్‌లో యోగి.. వైరల్) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్కౌంటర్లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ముజఫర్ నగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ములాయం కోపం నా మీదే, ఆయన మీద కాదు’
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరోసారి తన బాబాయి రాంగోపాల్ యాదవ్‌పై మీద ప్రశంసల జల్లు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఎన్నికల చిహ్నాన్ని కూడా ఆయనే కాపాడారని అన్నారు. కాగా నిన్న (గురువారం) రాంగోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందన్నారు. అయితే ఈ వేడుకకు ములాయం సింగ్ యాదవ్‌తో పాటు మరో సోదరుడు శివపాల్ యాదవ్ కూడా దూరంగా ఉన్నారు. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానం ఇస్తూ ‘ వాళ్లు ఎందుకు రాలేదో నాకు తెలుసు. మిగతా వాళ్ల మీద కన్నా నా మీదే కోపం’ అని తెలిపారు. అయితే తండ్రితో విభేదించి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ అఖిలేష్ మాత్రం తన చిన్నాన్నపై ఏ మాత్రం విశ్వాసం తగ్గలేదు సరికదా, ఆయన వల్లే తాము అధికారంలో ఉన్నప్పుడు క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేశామన్నారు. మరోవైపు రాంగోపాల్ యాదవ్ కూడా అఖిలేష్‌పై తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. 2022లో తిరిగి అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచి పని చేయాలంటూ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ములాయం సింగ్ యాదవ్ ఆగ్రహంగా ఉన్న విషయం విదితమే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం కోసం ములాయం సింగ్, అఖిలేష్ మధ్య జరిగిన పోరులో అఖిలేషే పై చేయి సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. -
‘ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు’
-
‘ఎగ్జిల్ పోల్స్ ఫలితాలు తారుమారు’
లక్నో: ఉత్తరప్రదేశ్ లో వందశాతం గెలుపు తమదేనని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నాయకుడు రాంగోపాల్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణంగా వార్తా చానళ్లు కొద్ది రోజుల క్రితమే ఎగ్జిల్ పోల్స్ ఫలితాలను మార్చినట్టు తమ దగ్గర సమాచారం ఉందని చెప్పారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ తో సమాజ్ వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని బీజేపీ నాయకుడు శ్రీకాంత్ శర్మ ప్రశ్నించారు. అవసరమైతే బీఎస్పీతో చేతులు కలుపుతామని సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించడం వెనుక ఒత్తిడి ఉందని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా తమ కూటమే విజయం సాధిస్తుందని ఎస్పీ, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. -
సోదరుడికి మరో షాకిచ్చిన ములాయం
న్యూఢిల్లీ: తన కొడుకు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్‌పై ఆగ్రహంతో ఉన్న ములాయం సింగ్ యాదవ్ మరో షాకిచ్చారు. ఎంపీ రాంగోపాల్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీలో సభ్యుడు కాదని ప్రకటించిన ములాయం.. ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి లేఖ రాశారు. సమాజ్‌వాదీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న రాంగోపాల్‌ను తొలగించి, ఆయనపై అనర్హత వేటు వేటు వేయాలని ములాయం కోరారు. ములాయం రాసిన లేఖ అన్సారీకి అందింది. త్వరలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్, రాంగోపాల్ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అఖిలేష్, రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన ములాయం తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ఆదివారం ములాయం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాంగోపాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ సభ్యుడు కారని ప్రకటించారు. -
ఏదో ఒకరోజు ఆయన ప్రధాని అవుతారు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్యపోరు అనూహ్య మలుపులు తిరుగుతూ రక్తికట్టిస్తోంది. ఎస్పీ జాతీయ అధ్యక్షుడు తానేనని, అఖిలేష్ ముఖ్యమంత్రి మాత్రమేనని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించగా.. అఖిలేష్ పార్టీ కంటే గొప్పవాడని, ఏదో ఒకరోజు ప్రధాన మంత్రి అవుతారని, ఆయనకు ఆ సామర్థ్యం ఉందని రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యానించారు. తమకు పార్టీ చిహ్నం సైకిల్ వచ్చినా, రాకపోయినా.. ఈ విషయం పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో ములాయం మాట్లాడుతూ రాంగోపాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, పార్టీ సభ్యుడు కాదని చెప్పారు. ఆ తర్వాత రాంగోపాల్ స్పందించారు. అఖిలేష్‌తో కలసి తాము ధర్మయుద్ధం చేస్తున్నామని, తాను ఉన్నా లేకపోయినా ఏదో ఒకరోజు అఖిలేష్ ప్రధాని అవుతారని అన్నారు. అమర్ సింగ్, మరికొందరు ములాయంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న అమర్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఫోర్జరీ చేసేవాళ్లకు అందరూ అలాగే కనిపిస్తారని చురకలంటించారు. అన్ని ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని రాంగోపాల్ చెప్పారు. -
బలప్రదర్శనకు దిగిన ములాయం.!
-
ఎస్పీ మాదే: అఖిలేశ్ వర్గం
న్యూఢిల్లీ: యూపీలో ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సీఎం అఖిలేశ్ వర్గం ముందడుగేసింది. అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సంతకాలు చేసిన అఫిడవిట్లను రామ్‌గోపాల్ యాదవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు. రాంగోపాల్ మాట్లాడుతూ ఎస్పీ లోని 90 శాతం మంది అఖిలేశ్ పక్షాన ఉన్నారు కాబట్టి తమదే అసలైన ఎస్పీ అనీ, ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను తమకే కేటాయించాలని కోరారు. పార్టీకున్న 229 మంది ఎంఎల్ఏల్లో 200 మందికి పైగా, 68 మంది ఎంఎల్సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది అఖిలేశ్‌కు మద్దతు తెలుపుతున్నారన్నారు. కాగా, తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన అఫిడవిట్లను ములాయం వర్గం సోమవారం ఈసీకి సమర్పించే వీలుంది. -
ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?
-
ములాయం 'సైకిల్' అఖిలేశ్‌కేనా?
లక్నో: సమాజ్‌వాది పార్టీ పూర్తిగా సీఎం అఖిలేశ్ యాదవ్ చేతుల్లోకి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఆ పార్టీ గుర్తు కూడా ఈసీ అఖిలేశ్ వర్గమే కొల్లగొట్టేలా కనిపిస్తోంది. సమాజ్ వాది పార్టీలో ఉన్న నేతలంతా కూడా అఖిలేశ్ వెనుకే క్యూ కట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమాజ్ వాది పార్టీ మొత్తం తమతోనే ఉందని అఖిలేశ్ వర్గంలోని కీలక నేత రాంగోపాల్ యాదవ్ మరోసారి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 229మంది ఎమ్మెల్యేల్లో 212మంది తమతోనే ఉన్నారని, అలాగే 68మంది ఎమ్మెల్సీల్లో 56మంది ఉన్నారని, ఇక 24 మంది ఎంపీల్లో 15మంది తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. వీరంతా కూడా తమకు మద్దతిస్తూ సంతకాలు చేశారని చెప్పారు. పార్టీ అధికారిక గుర్తుకు సంబంధించి ఈసీకి అందించాల్సిన అఫిడవిట్లో వీరంతా సంతకాలు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీ గుర్తు అయినా సైకిల్ తమకే వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా ఈసీకి అఫిడవిట్ అందిస్తామని చెప్పారు. -
90 శాతం మంది ఎమ్మెల్యేలు మా వెంటే
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో 90 శాతం మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్ యాదవ్ చెప్పారు. పార్టీ గుర్తు విషయంపై మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్‌ను ఎన్నుకున్నామని, ఆయన సారథ్యంలోనే పార్టీ నడుస్తోందని రాంగోపాల్ చెప్పారు. పార్టీలో ఎక్కువ మంది మద్దతు ఉన్న అఖిలేష్‌కు పార్టీ చిహ్నం సైకిల్‌ను కేటాయించాలని ఈసీని కోరినట్టు తెలిపారు. సోమవారం ములాయం సింగ్ యాదవ్ వర్గం కూడా ఎన్నికల సంఘాన్ని కలసి తమకు సైకిల్ గుర్తును కేటాయించాల్సిందిగా కోరింది. ఆధిపత్య పోరులో ములాయం కుటుంబం, పార్టీ రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. అఖిలేష్‌కు బాబాయ్ రాంగోపాల్‌తో పాటు చాలామంది పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ములాయం వెంట సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ములాయంను తొలగించి ఆయన కొడుకు అఖిలేష్‌ను ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు గ్రూపులు పార్టీ గుర్తు కోసం పోరాడుతున్నాయి. -
ఎస్పీలో సమసిన సంక్షోభం
-
ఎస్పీలో సమసిన సంక్షోభం
అఖిలేశ్, రాంగోపాల్‌ల బహిష్కరణ రద్దు - తక్షణమే అమల్లోకి: ములాయం - అఖిలేశ్ బలప్రదర్శన, లాలూ మంత్రాంగం ఎఫెక్ట్ ∙ములాయంతో అఖిలేశ్ భేటీ లక్నో: యాదవ కుటుంబంలో ముదిరిన ముసలం ఒక్క రోజు తిరక్కముందే సద్దుమణిగింది. తనయుడు అఖిలేశ్‌తోపాటు రాంగోపాల్‌పై వేసిన బహిష్కరణ వేటును సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ శనివారం హైడ్రామా నడుమ వెనక్కి తీసుకున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలతో అఖిలేశ్ బలప్రదర్శన, బంధువైన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యవర్తిత్వం ఫలించింది. ‘ములాయం ఆదేశాల మేరకు అఖిలేశ్, రాంగోపాల్‌ల బహిష్కరణను తక్షణం రద్దు చేస్తున్నాం’ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ములాయం తమ్ముడు శివపాల్‌యాదవ్ చెప్పారు. ‘ములాయం, అఖిలేశ్‌లను కలిశా. అన్ని అంశాలూ కొలిక్కి వచ్చాయి. కలసికట్టుగా పూర్తి మెజారిటీతో ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ములాయంతో కూర్చుని సమస్యలను పరిష్కరించుకుంటాం’ అని చెప్పారు. బహిష్కరణ రద్దుతో.. శనివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా తాను ఏర్పాటు చేస్తున్నట్లు రాంగోపాల్ ప్రకటించిన ఆదివారం నాటి పార్టీ జాతీయ అత్యవసర సమావేశం ఐక్యతా ప్రదర్శనకు వేదికయ్యే వీలుంది. విభేదాల్లేవని చెప్పేందుకు ఎన్నికల కోసం అఖిలేశ్, ములాయంల ఉమ్మడి ముద్రతో కూడిన అభ్యర్థుల పేర్లతో కొత్త జాబితాను తయారు చేస్తారని సమాచారం. అఖిలేశ్ ఇంట్లో బలప్రదర్శన విభేదాలు, ములాయం తెచ్చిన అభ్యర్థుల జాబితాకు పోటీగా అఖిలేశ్, ఆయన చిన్నాన్న రాంగోపాల్‌లు జాబితా తయారు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ తప్పారంటూ వారిని పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. దీంతో అఖిలేశ్ శనివారం 200 మందికిపైగా ఎస్పీ ఎమ్మెల్యేల(మొత్తం ఎస్పీ ఎమ్మెల్యేలు 229)తో తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీకి కొందరు సీనియర్ ఎమ్మెల్సీలూ వచ్చారు. వారంతా ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత సీనియర్ నేత ఆజం ఖాన్ అక్కడికి చేరుకున్నారు. కాసేపటి తర్వాత అఖిలేశ్ తో కలసి దగ్గర్లోని ములాయం ఇంటికెళ్లి మాట్లాడారు. తర్వాత ఆజం విలేకర్లతో మాట్లాడుతూ.. ములాయం, అఖిలేశ్‌ల చర్చలు సానుకూలంగా సాగాయని, అలిగిన తండ్రి తన కొడుకుతో మాట్లాడినట్లు ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలతో అఖిలేశ్ భేటీ సమయంలో ఆయన ఇంటి ముందు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఆయనపై బహిష్కరణను ఎత్తేయాలని డిమాండ్ చేశారరు. తమను అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కూడా అఖిలేశ్, శివపాల్ యాదవ్‌ల మద్దతుదారులు గొడవ పడ్డారు. కాగా, ఎస్పీలో సంక్షోభం దురదృష్టకరమని, పార్టీ, ములాయం కుటుంబాన్ని చీల్చేందుకు పన్నిన కుట్ర విఫలమైందని పార్టీ నేత అమర్ సింగ్ అన్నారు. ‘బహిష్కరణను రద్దు చేసి ములాయంసింగ్ యాదవ్ మంచిపని చేశారు. ఆయన బతికుండగా పార్టీని, కుటుంబాన్ని చీలనివ్వరు. పార్టీ సభ్యులందరూ ఏకతాటిపైకొచ్చి ఆయనకు అండగా నిలబడాలి’ అని కోరారు. కాగా, అఖిలేశ్ తిరిగి ఎస్పీలోకి వచ్చినా, ప్రభుత్వ వైఫల్యం వల్ల ఉత్తరప్రదేశ్‌లో తిరిగి అధికారంలోకి రారని భారతీయ జనతా పార్టీ శనివారం ఎద్దేవా చేసింది. లాలూ ఫోన్ రాయబారం పట్నా: ఎస్పీ గొడవ పరిష్కారంలో లాలూ ప్రసాద్ ఓ చెయ్యేశారు. ములాయం, అఖిలేశ్‌లతో ఫోన్లో మాట్లాడి.. సయోధ్య కుదిర్చారు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు పడొద్దని, విడివిడిగా ఎన్నికలకు వెళ్లి శత్రువులను బలోపేతం చేయొద్దని చెప్పారు. ‘మొదట ములాయంతో మాట్లాడాను. ప్రధాన్యంలేని వ్యక్తులను పట్టించుకోవద్దన్నాను. తర్వాత అఖిలేశ్‌తో మాట్లాడి తండ్రితో భేటీ కావాలని చెప్పాను.. అఖిలేశ్ బహిష్కరణను రద్దు్ద చేసినందుకు నాకు సంతోషంగా ఉంది’ అని లాలూ పట్నాలో విలేకర్లకు చెప్పారు. రాజీ కుదర్చడం బంధువుగా తన బాధ్యత అని అన్నారు. లాలూ కుమార్తెల్లో ఒకరిని, ములాయం సోదరుడి కుమారుడైన ఎంపీ తేజ్ ప్రతాప్యాదవ్కిచ్చి పెళ్లి చేయడం తెలిసిందే. -
యూపీలో క్షణం..క్షణం..ఉత్కంఠ
-
యూపీలో క్షణం..క్షణం..ఉత్కంఠ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అధికార పక్షం సమాజ్‌వాది పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దష్టి ఇప్పుడు ఈ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలపైనే కేంద్రీకతమై ఉంది. పార్టీ నుంచి తనను తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం తన ఇంట్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొంత మంది పార్టీ సీనియర్ నాయకులతోపాటు 190 మంది పార్టీ శాసన సభ్యులు హాజరైనట్లు అఖిలేష్ మద్దతుదారులు తెలియజేశారు. తన మద్దతుదారులతో సంప్రతింపులు జరిపిన అనంతరం అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌ను కలసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కూడా అక్కడ తన మద్దతుదారులతో ఇదే సమయంలో సమావేశమయ్యారు. ఆయన సమావేశానికి అధికార పార్టీకి చెందిన 20 మంది శాసన సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరైనట్లు తెల్సింది. పార్టీ నుంచి విడిపోయేందుకు అఖిలేష్ సిద్ధపడ్డారా లేదా ఆఖరి సారి తండ్రితో సంధికి ప్రయత్నించేందుకు ఆయన వద్దకు అఖిలేష్ వెళ్లారా? అన్న విషయం స్పష్టం కావడం లేదు. అయితే ఆయన తన తండ్రి ఆశీర్వాదం తీసుకునేందుకే వెళ్లారని కొందరు అఖిలేష్ సన్నిహితులు తెలియజేస్తున్నారు. అఖిలేష్ ప్రభుత్వం పడిపోతుందా? రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 404 సీట్లు ఉండగా, వాటిలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సమాజ్‌వాది పార్టీకి మొత్తం 229 మంది ఉన్నారు. వారి నుంచి 190 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అఖిలేష్ వర్గం తెలియజేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు ఉన్నాయి. అఖిలేష్‌ను పార్టీ నుంచి బహిష్యరించిన నేపథ్యంలో ఆయన్ని సభా విశ్వాసాన్ని పొందాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్ కోరినట్లయితే ఏం జరుగుతందనే అంశంపై కూడా మరోపక్క చర్చ జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ విశ్వాసాన్ని కోరాల్సి వస్తే అందుకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. అంటే ఎస్పీ నుంచి అఖిలేష్ తన మద్దతుదారులతో విడిపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది సభ్యులు ఆయన ప్రభుత్వానికి మద్దతిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ లక్నోలోనే మకాం వేసి ఎస్పీలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అఖిలేష్‌కు అసెంబ్లీ బలనిరూపణకు 201 మంది సభ్యుల మద్దతు ఉంటే చాలు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయనకు 218 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది కనుక ఆయన ప్రభుత్వానికి ఢోకాలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ వర్గంతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ములాయం సింగ్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్న విషయం ప్రస్తుతానికి అంతుచిక్కకుండానే ఉంది. అపార రాజకీయ అనుభవం కలిగిన ములాయం సింగ్ యాదవ్ రాజకీయ ఎత్తుగడుల్లో ఆరితేరిన వారు. అలాంటి వ్యక్తి పార్టీ చీలిపోయేందుకు ఆస్కారమిస్తారా? అన్నది అసలు ప్రశ్న. చీలిపోతే ఎక్కువ నష్టపోయేది ఆయన వర్గమే. కాంగ్రెస్ అండతో వచ్చే ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఎలాగు ఉంది. ప్రస్తుతమున్న సమీకరణల ప్రకారం రానున్న ఎన్నికల్లో బీజీపీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ జరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ చీలిపోతే ఎక్కువ నష్టపోయేది ములాయం వర్గం కాగా, ఎక్కువ లాభపడేది బీజేపీ. అంతా నాటకమేనా? ప్రభుత్వం వ్యతిరేక ముద్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై పడ కుండా ఉండేందుకే ములాయం సింగ్ యాదవ్ పార్టీలో లేని అంతర్గత విభేదాలను సష్టించారని, అహిష్టంగానే కాంగ్రెస్‌కు, అఖిలేష్‌కు మధ్య సంధికుదిర్చేందుకు కూడా సిద్ధమయ్యారని కొంత మంది కాంగ్రెస్ నాయకులతోపాటు కొంత మంది రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగానే రసవత్తరమైన మహా రాజకీయ నాటకానికి ములాయం తెరతీశారని ఇప్పటికీ అంటున్న వారు ఉన్నారు. అయితే ఈ నాటకం పార్టీ నుంచి అఖిలేష్‌ను బహిష్కరించేంత దూరం కొనసాగుతుందా? అన్నది ఇక్కడ ప్రధాన సందేహం. ఆదివారం నాడు పార్టీ జాతీయ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో కాస్త స్పష్టత రావాలంటే రేపటి వరకు నిరీక్షించాల్సిందే. -
నోటీసులపై సమాధానం వినకుండానే..!
-
నోటీసులపై సమాధానం వినకుండానే..!
లక్నో: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. కుమారడు అఖిలేష్ యాదవ్‌తో పాటు సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నిర్ణయంపై రాంగోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి : ములాయం కుటుంబంలో ఏం జరిగింది? ) పార్టీ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న చర్య పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని రాంగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. మా ఇద్దరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చాక సమాధానం వినకుండానే పార్టీ నుంచి ఎలా బహిష్కరిస్తారంటూ మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రశ్నించారు. పార్టీ అధినేతనే ఇలాంటి రాజ్యాంగ విరుద్దమైన చర్యకు పాల్పడితే ఎలా అని రాంగోపాల్ యాదవ్ వాపోయారు. తొందరలోనే ప్రజల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుందన్న ఆయన.. జనవరి 1న రాంమనోహర్ లోహియా యూనిర్సిటీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
'అందరూ వద్దంటున్నా.. సీఎం పెళ్లి నేనే చేశా'
ములాయం సింగ్ యాదవ్ కుటుంబం అంతా అఖిలేష్ యాదవ్ పెళ్లిని వ్యతిరేకిస్తుంటే.. డింపుల్‌తో అతడి పెళ్లి తానే చేయించానని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ యాదవ్ సహచరుడు అమర్ సింగ్ చెప్పారు. అప్పట్లో అఖిలేష్ తరఫున గట్టిగా నిలబడింది తానొక్కడినేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా అతడి పెళ్లి ఫొటోలు చూస్తే.. తాను లేకుండా ఏ ఒక్క ఫొటో కూడా ఉండదని తెలిపారు. అలాంటి అఖిలేష్ యాదవ్.. ఇప్పుడు తనను 'దలాల్' అంటూ వ్యాఖ్యానించడం చూస్తే చాలా బాధాకరం అనిపిస్తోందని అమర్ సింగ్ చెప్పారు. 'ముఖ్యమంత్రి అఖిలేష్'కు తాను సన్నిహితం కాకపోవచ్చు గానీ.. ములాయం కొడుకు అఖిలేష్‌కు మాత్రం తాను ఎప్పుడూ సన్నిహితంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అయినా దొరుకుతుంది గానీ అఖిలేష్ అపాయింట్మెంట్ మాత్రం దొరకదన్నారు. తన బలితోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటే.. బలిదానం చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. రాంగోపాల్ యాదవ్ తనను బెదిరిస్తూ చేసిన ప్రకటన చూసి భయం వేస్తోందని.. తనకు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారని అమర్ సింగ్ చెప్పారు. రాంగోపాల్ యాదవ్‌ను తాను ఎప్పుడూ 'నపుంసకుడు' అనలేదని, ఆయన పేరుతోను, బాలగోపాల్ అనే పేరుతో మాత్రమే పిలిచానని చెప్పారు. తానెప్పుడూ అలాంటి తిట్లు వాడలేదన్నారు. పవన్ పాండే చేతిలో దెబ్బలు తిన్నారని కథనాలు వచ్చిన అషు మాలిక్‌ను తాను ఎప్పుడూ కలవలేదని అమర్ తెలిపారు. శివపాల్ యాదవ్‌కు బదులు అఖిలేష్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించినప్పుడు కూడా తననే అందరూ తప్పుబట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు శివపాల్ యాదవ్ మాత్రం తనను తప్పుబట్టకుండా, కొత్త అధ్యక్షుడైన అఖిలేష్‌ను పార్టీ కార్యాలయంలోకి ఆహ్వానించారన్నారు. ఇక నవంబర్ 3వ తేదీ నుంచి అఖిలేష్ యాదవ్ నిర్వహించనున్న రథయాత్రకు తనకు ఆహ్వానం లేదని.. అలాంటప్పుడు తాను అక్కడకు వెళ్తే అఖిలేష్ మద్దతుదారులు తన దుస్తులు చింపి, కొట్టడం ఖాయమని అమర్ సింగ్ చెప్పారు. అప్పుడు అనవసరంగా అఖిలేషే తనను కొట్టించాడన్న ఆరోపణలు వస్తాయని, అందువల్ల ఆ రథయాత్రకు తాను వెళ్లడం లేదని తెలిపారు. -
అఖిలేశ్ యాదవ్ లేకపోతే.. ఎస్పీ లేనట్టే!
లక్నో: కన్న కొడుకు అఖిలేశ్ యాదవ్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ మండిపడ్డారు. ఎస్పీలో కొనసాగుతున్న అంతర్గత సంక్షోభంలో ములాయం తన తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ పట్ల కొమ్ముకాస్తున్నారని, ఆయన తటస్థంగా ఉండటం లేదని విరుచుకుపడ్డారు. '2012లో అఖిలేశ్ పేరుతో ఎన్నికల్లోకి వెళ్లారు. ప్రజలు ఆయనకు సంపూర్ణ మెజారిటీ కట్టుబెట్టారు. అఖిలేశ్‌కు ప్రజాదరణ లేకపోతే ఆయన ఎలా గెలిచేవారు. అఖిలేశ్ లేకుంటే ఎస్పీ లేనట్టే' అని రాంగోపాల్ యాదవ్ మంగళవారం విలేకరులతో అన్నారు. పార్టీలో విభేదాలు ఎలా ఉన్నా నవంబర్ 3 నుంచి తలపెట్టిన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని అఖిలేశ్‌కు తాను సూచించానని, ఆయన ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పార్టీలో ఆధిపత్యాన్ని వహిస్తున్న బాబాయి శివ్‌పాల్ యాదవ్‌ను, ఆయన విధేయులను మంత్రివర్గం నుంచి అఖిలేశ్ తొలగించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా అఖిలేశ్ అనుకూల నాయకుడు, ములాయం కజిన్ సోదరుడు రాంగోపాల్ యాదవ్‌ను శివ్‌పాల్ యాదవ్ తొలగించారు. దీంతో సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. -
సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?
-
సమాజ్‌వాదీ పార్టీలో చీలిక?
- తండ్రీకొడుకుల మధ్య ముదురుతున్న వివాదం - బాబాయ్ శివ్‌పాల్ సహా ముగ్గురు మంత్రులపై అఖిలేశ్ వేటు - వారంతా అమర్‌సింగ్ వర్గం నేతలే - ప్రతిగా సీఎంకు మద్దతుగా ఉన్న రాంగోపాల్ బహిష్కరణ - ఎస్పీలో ముదురుతున్న వివాదం - ఎఫ్డీసీ నుంచి జయప్రదకూ ఉద్వాసన నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్, సయేదా షాదాబ్ ఫాతిమాలను మంత్రి వర్గం నుంచి అఖిలేష్ తొలగించగా.. సీఎం వర్గానికి చెందిన రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి అధ్యక్షుడు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది. లక్నో: నివురుగప్పిన నిప్పులా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అంతర్గత రాజకీయాలు రోడ్డున పడ్డాయి. ఇన్నాళ్లూ సీఎం అఖిలేశ్, పార్టీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్‌ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం.. ఇప్పుడు సీఎం, పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయం మధ్య వేడి రాజేస్తోంది. ఆదివారం జరిగిన అనూహ్య పరిణామాల్లో.. అఖిలేశ్, ములాయం తమ వ్యతిరేక వర్గాల్లోని ముఖ్యనేతలపై వేటు వేయటంతో పార్టీ ముక్కలు కాక తప్పదనే సంకేతాలొచ్చాయి. పార్టీ నేతలు కూడా బయటపడకున్నా రెండుగా చీలిపోయారు. తండ్రీ కొడుకుల వివాదం మళ్లీ సర్దుకునే పరిస్థితులు కనిపించకపోవటంతో.. చీలిక అనివార్యమని రాజకీయ నిపుణులంటున్నారు. ఏం జరిగింది? సోమవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలతోపాటు కీలక నేతలతో జాతీయాధ్యక్షుడు ములాయం సింగ్ భేటీ ఏర్పాటు చేశారు. భేటీలో పార్టీ అభివృద్ధి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం అందింది. ఇంతలోనే ఆదివారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలేశ్ హడావుడిగా భేటీ అయ్యారు. ఎన్నికలు, నవంబర్ 3 నుంచి జరగనున్న ‘వికాస్ యాత్ర’పై చర్చించిన అఖిలేశ్.. పార్టీలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమనే ధోరణిలోనే కనిపించారు. సమావేశం నుంచి బయటకు రాగానే.. శివ్‌పాల్, నారద్ రాయ్, ఓం ప్రకాశ్ (కేబినెట్ మంత్రులు), సయేదా షాదాబ్ ఫాతిమా (సహాయ మంత్రి)లను మంత్రి వర్గం నుంచి తొలగిస్తున్నట్లు గవర్నర్ రాంనాయక్‌కు సిఫారసు చేశారు. దీన్ని గవర్నర్ వెంటనే ఆమోదించారు. దీంతోపాటు యూపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలిగా జయప్రదను కూడా తొలగించారు. అమర్‌సింగ్ ఛాయలొద్దు: అమర్‌సింగ్ వర్గంలోని వారెవరూ తన ప్రభుత్వంలో ఉండటానికి వీల్లేదని అఖిలేశ్ చెప్పినట్లు పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, ఈ ముగ్గురిని తొలగించేందుకు కొద్ది సేపటి ముందు.. అఖిలేశ్ అనుకూల వర్గం నాయకుడైన రాంగోపాల్ యాదవ్ (ములాయం చిన్నాన్న కుమారుడు) పార్టీ కార్యకర్తలకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సీఎంకు సంపూర్ణ మద్దతివ్వాలి. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో ముఖం చూపించే అవకాశం ఉండదు’ అని ఇందులో పేర్కొన్నారు. అయితే పార్టీని వీడే ఆలోచన లేదని.. నేతాజీ (ములాయం)కు వెన్నుదన్నుగా ఉంటానని.. ఎమ్మెల్యేల సమావేశంలో అఖిలేశ్ అన్నట్లు సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. నవంబర్ 3న వికాస్ యాత్ర మొదలైనా.. ఐదున జరిగే పార్టీ రజతోత్సవాల్లో సీఎం పాల్గొంటారన్నారు. ములాయంను కలసిన శివ్‌పాల్ తనను మంత్రివర్గం నుంచి తొలగించటంతో ఎస్పీ యూపీ చీఫ్ శివ్‌పాల్ యాదవ్.. ములాయంను కలిశారు. తర్వాత బయటకు వచ్చిన శివ్‌పాల్.. ‘రాంగోపాల్‌ను పార్టీ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తప్పించటంతోపాటు పార్టీ నుంచి ఆరేళ్లపాటు ములాయం బహిష్కరించారు. నన్ను మంత్రిపదవి నుంచి తప్పించినందుకు బాధపడ్డం లేదు. వచ్చే ఎన్నికల్లో ములాయం నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది’ అని ప్రకటించారు. బీజేపీతో కుమ్మక్కైన రాంగోపాల్.. తనపై, కుమారుడిపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు మూడుసార్లు ఓ బీజేపీ నేతను కలిశారని ఆరోపించారు. ఈ పరిణామాలతో ఎస్పీ నిట్టనిలువుగా చీలిపోయింది. తాజా పరిణామాలపై సోమవారం ప్రజాముఖంగా స్పందిస్తానని ములాయం తెలిపారు. కాచుక్కూచున్న విపక్షాలు యూపీ అన్ని పార్టీలకూ కీలకం. 2019లో కేంద్రంలో క్రియాశీలంగా ఉండాలనుకునే పార్టీలకు ప్రస్తుత పరిస్థితుల్లో యూపీలో పాగా వేయటంఅవసరం. మరీ ముఖ్యంగా బీజేపీకి. ఎస్పీ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యనేత రీటా బహుగుణను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. తాజా పరిణామాలతో అఖిలేశ్ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎస్పీ వివాదంతో మెజారిటీ సాధించేలా బీజేపీ పావులు కదుపుతోంది. బీఎస్పీ కూడా ఈ పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. ఎస్పీలో చీలిక ప్రధాన ప్రతిపక్షమైన తమకే అనుకూలిస్తోందని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా తాజా మార్పులపై విశ్లేషణ చేసుకుంటోంది. రాహుల్ పర్యటనలకు తోడు ప్రియాంకను వీలైనంత త్వరగా రంగంలోకి దించటం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలనుకుంటోంది. -
బాబాయ్‌పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు
-
బాబాయ్‌పై వేటువేస్తే.. తమ్ముడిని సాగనంపారు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో, ఆ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆదివారం వేగంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీని సంక్షోభంలో పడేశాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్.. బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ సహా నలుగురు మంత్రులపై వేటువేయగా.. అఖిలేష్‌కు మద్దతుగా ఉన్న సమీప బంధువు, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ నుంచి ములాయం బహిష్కరించారు. రాంగోపాల్‌ను పార్టీ పదవి నుంచి తొలగించడంతో పాటు ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు యూపీ ఎస్పీ చీఫ్ శివపాల్ ప్రకటించారు. ములాయంకు శివపాల్ సొంత తమ్ముడు కాగా, రాంగోపాల్ వరుసకు సోదరుడు అవుతారు. అఖిలేష్‌ను రాంగోపాల్ తప్పుదోవ పట్టిస్తున్నారని శివపాల్ అన్నారు. రాంగోపాల్ తనపై కుట్రపన్నారని, ఆయన కొడుకును రక్షించుకోవడానికి బీజేపీతో చేతులు కలిపాడని ఆరోపించారు. అంతకుముందు అఖిలేష్‌కు మద్దతుగా రాంగోపాల్ ఎస్పీ చీఫ్ ములాయంకు లేఖ రాశారు. -
అన్నయ్యా.. చరిత్ర ఎవ్వరినీ క్షమించదు!
- ఎన్నికల్లో 100 సీట్లైనా గెలవకుంటే బాధ్యుడివి నువ్వే - ఎస్పీ చీఫ్ ములాయంకు తమ్ముడు రాంగోపాల్ ఘాటులేఖ లక్నో: 'అన్నయ్యా.. కొడుకును కాదని నీకు ప్రీతిపాత్రుడైన తమ్ముణ్ణి(శివపాల్ యాదవ్‌ను)వెనకేసుకొస్తున్నావ్. మంచిది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేకపోతే దానికి బాధ్యుడివి నువ్వే. ఇంత చేస్తున్న నువ్వు అసలు చరిత్రను ఒక్కసారైనా పరికించావా? చరిత్ర.. చాలా క్రూరమైనది. ఏ ఒక్కరినీ క్షమించదు' అంటూ సమాజ్ వాది పార్టీ ముఖ్యనేత రాంగోపాల్ యాదవ్.. తన పెద్దన్న, పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు శనివారం ఘాటు లేఖ రాశారు. 2017 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సీఎం అభ్యర్థి కాబోడంటూ ఇటీవల ములాయం చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. చాలా కాలంగా కొడుకు అఖిలేష్, తమ్ముడు శివపాల్ ల మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరును సమం చేయాలని ములాయం భావిస్తున్నారని, ఆ క్రమంలో పెద్దాయన తమ్ముడివైపు మొగ్గుతున్నారని రాంగోపాల్ యాదవ్ తన లేఖలో ఆక్షేపించారు. తన అద్భుతమైన పరిపాలనతో సీఎం అఖిలేష్ యూపీ ప్రజల మన్ననలు పొందారని, 2017 ఎన్నికల్లోనూ అఖిలేష్ నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని, లేకుంటే దారుణమైన ఫలితాలు చవిచూడాల్సి వస్తుందని రాంగోపాల్ అభిప్రాయపడ్డారు. మొదటి నుంచి సోదరుడు శివపాల్ యాదవ్ ను వ్యతిరేకిస్తోన్న రాంగోపాల్ యాదవ్.. ఆధిపత్య పోరులో సీఎం అఖిలేష్ పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం అఖిలేష్ టీంలో ప్రధాన వ్యూహకర్త రాంగోపాలే. ఆధిపత్యం కోసం ఇప్పటిదాకా జరిగిన పోరులో అఖిలేష్ వర్గం ఏనాడూ పార్టీ సుప్రీం ములాయంను నేరుగా విమర్శించలేదు. ఇప్పుడా కొరత తీర్చుతూ రాంగోపాల్.. ములాయంపై ఘాటులేఖాస్త్రాన్ని సంధించారు. దీనిపై వైరిపక్షం స్పందించాల్సిఉంది. -
ములాయం కుటుంబంలో చిచ్చు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇంట విభేదాలు భగ్గుమన్నాయి. కువామి ఏక్తాదల్ (క్యూఈడీ)ను ఎస్పీలో విలీనం చేసుకోకపోవడంపై ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. బుధవారం ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ పుట్టినరోజు వేడుకలకు ఆలస్యంగా చేరుకున్న శివ్‌పాల్ వేదికపైకి వెళ్లకుండా అతిథుల మధ్యే కూర్చున్నారు. అయితే పార్టీ నేతలు చెప్పడంతో వేదిక వద్దకు వెళ్లినా వెనక వరుసలో కూర్చున్నారు. మళ్లీ సీనియర్ నేతలు కల్పించుకోవడంతో ముందు వరుసలో కూర్చున్నారు. వేడుకలో ములాయం, అఖిలేశ్‌లను శివ్‌పాల్ పలకరించలేదు. గోపాల్‌కు శుభాకాంక్షలు తెలపలేదు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా శివ్‌పాల్ హాజరుకాలేదు. కుయామీ ఏక్తాదల్ను ఎస్పీలో విలీనం చేసుకోడానికి గతవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు అంగీకరించనప్పటి నుంచి శివ్‌పాల్ అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 2017 లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ములాయం ఇంట ఈ వివాదం చర్చనీయాంశమైంది. -
'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిక కారణమైన వారు విద్రోహులంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తాను పొరపాటున ఈ మాట అన్నానని ఒప్పుకున్నారు. విద్రోహులు అన్న మాట అనునుండాల్సింది కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కొంత మంది కార్యకర్తలు పార్టీకి సహకరించలేదని, వీరంతా విద్రోహులని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 80 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. పార్టీ ఓటమిపై 26 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించిన పరిశీలకులు నివేదికను సోమవారం రాంగోపాల్ యాదవ్ కు అందజేశారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా ఉందా, లేదా అనేది తర్వాత తెలుస్తుందన్నారు. -
'ఎన్నికల తర్వాత అన్నయ్యే ప్రధాని'
ఆజమ్ ఘడ్: లోకసభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిని ములాయం సింగ్ యాదవ్ చేపడుతారని ఆయన సోదరుడు, సమాజ్ వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ధీమాను వ్యక్తం చేశారు. అజమ్ ఘడ్ నియోజకవర్గంలోనే కొనసాగుతారని.. మెయిన్ పూరి స్థానాన్ని వదులకుంటారని రాంగోపాల్ యాదవ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘడ్, మెయిన్ పూరి స్థానాల నుంచి లోకసభకు ములాయం పోటీ చేస్తున్నారు. ఆజమ్ ఘడ్ నుంచి గెలిచే ములాయం దేశానికి ప్రధాని అవుతారన్నారు. అయితే ములాయం చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా రాంగోపాల్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇటీవల మెయిన్ పూరి స్థానం నుంచి కొనసాగుతానని ములాయం అన్నారు. ఎన్నికల తర్వాత మూడవ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాంగోపాల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం : ఎస్పీ
రాష్ట్రాల విభజనకు తాము పూర్తి వ్యతిరేకమని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) స్పష్టం చేసింది. విభజనతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయన్న మాటకు తమ పార్టీ కట్టబడి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. గతంలో బీఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆసెంబ్లీలో తీర్మానం చేసిందని, అయితే ఆ తీర్మానాన్ని సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకించిందని రామ్‌గోపాల్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.