యూపీలో ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సీఎం అఖిలేశ్ వర్గం ముందడుగేసింది
న్యూఢిల్లీ: యూపీలో ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సీఎం అఖిలేశ్ వర్గం ముందడుగేసింది. అఖిలేశ్‌కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు సంతకాలు చేసిన అఫిడవిట్లను రామ్‌గోపాల్ యాదవ్ ఎన్నికల సంఘానికి అందజేశారు. రాంగోపాల్ మాట్లాడుతూ ఎస్పీ లోని 90 శాతం మంది అఖిలేశ్ పక్షాన ఉన్నారు కాబట్టి తమదే అసలైన ఎస్పీ అనీ, ఎన్నికల గుర్తుగా సైకిల్‌ను తమకే కేటాయించాలని కోరారు.
పార్టీకున్న 229 మంది ఎంఎల్‌ఏల్లో 200 మందికి పైగా, 68 మంది ఎంఎల్‌సీల్లో 56 మంది, 24 మంది ఎంపీల్లో 15 మంది అఖిలేశ్‌కు మద్దతు తెలుపుతున్నారన్నారు. కాగా, తమ మద్దతుదారుల సంతకాలతో కూడిన అఫిడవిట్లను ములాయం వర్గం సోమవారం ఈసీకి సమర్పించే వీలుంది.