ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలో క్రిమినల్స్‌ను రూపుమాపటం కోసం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం యాంటీ క్రైం (యూపీ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం) బిల్లును మంగళవారం అసెంబ్లీలో మరోసారి ప్రవేశపెట్టింది. యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రాష్ట్రంలో క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేస్తున్న విషయం తెలిసింది. ఈ ఎన్‌కౌంటర్లన్ని రాజకీయ ఎన్‌కౌంటర్లుగా ప్రతిపక్షం విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దానిలో భాగంగా 2017 డిసెంబర్ 21న రాష్ట్ర శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టింది. శాసన సభలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందింది. ఇక శాసన మండలిలో 100 మంది సభ్యుల్లో బీజేపీకి కేవలం 13 మంది సభ్యులే ఉండటంతో బిల్లు విగిపోయింది. మండలిలో విపక్ష ఎస్‌పికి 61, బీఎస్‌పీకి 9 మంది చొప్పున సభ్యులు ఉండటంతో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదు. కాగా దేశంలో ఇదివరకే మహారాష్ట్ర ప్రభుత్వం క్రైంను అంతమొందించడం కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను తీసుకువచ్చిందని, ఉత‍్తరప్రదేశ్ లో కూడా అలాంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment