లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ విరుచుకుపడ్డారు. సీఎం హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని యోగికి రామ్ గోపాల్ సూచించారు. (సల్మాన్ గెటప్‌లో యోగి.. వైరల్)
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. యోగి పైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కారణం. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ‘లేపేస్తాం.. చంపి పడేస్తాం’ అంటూ యోగి మాట్లాడుతున్నారు. ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనా అవి. ఆయన అధికారంలోకి వచ్చాక ఫేక్ ఎన్‌కౌంటర్‌లు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం అమాయకులు ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రజలు అంతా గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ధి చెబుతారు’ అని రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు.
కాగా, శుక్రవారం ముజఫర్ నగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకడు తప్పించుకుని పోయాడు. ఈ కాల్పుల్లో అధికారి ఒకరు గాయపడగా.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment