ఉత్తరప్రదేశ్‌లోని అధికార పక్షం సమాజ్‌వాది పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు క్షణం క్షణం ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దష్టి ఇప్పుడు ఈ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాలపైనే కేంద్రీకతమై ఉంది. పార్టీ నుంచి తనను తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరించిన నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శనివారం ఉదయం తన ఇంట్లో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు.