విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం : ఎస్పీ | Samajwadi Party oppose Andhra Pradesh State Bifurcation bill | Sakshi
Sakshi News home page

విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం : ఎస్పీ

Published Tue, Feb 18 2014 1:26 PM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM

Samajwadi Party oppose Andhra Pradesh State Bifurcation bill

రాష్ట్రాల విభజనకు తాము పూర్తి వ్యతిరేకమని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) స్పష్టం చేసింది. విభజనతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయన్న మాటకు తమ పార్టీ కట్టబడి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ రామ్గోపాల్ యాదవ్ వెల్లడించారు.

 

మంగళవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. గతంలో బీఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉత్తరప్రదేశ్ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆసెంబ్లీలో తీర్మానం చేసిందని, అయితే  ఆ తీర్మానాన్ని సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకించిందని రామ్గోపాల్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement