'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం | Ram Gopal Yadav regrets making "traitors" comment | Sakshi
Sakshi News home page

'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం

Published Mon, Nov 3 2014 7:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం

'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం

లక్నో: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిక కారణమైన వారు విద్రోహులంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తాను పొరపాటున ఈ మాట అన్నానని ఒప్పుకున్నారు. విద్రోహులు అన్న మాట అనునుండాల్సింది కాదని పేర్కొన్నారు.

లోక్సభ ఎన్నికల్లో కొంత మంది కార్యకర్తలు పార్టీకి సహకరించలేదని, వీరంతా విద్రోహులని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 80 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. 

పార్టీ ఓటమిపై  26 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించిన పరిశీలకులు నివేదికను సోమవారం రాంగోపాల్ యాదవ్ కు అందజేశారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా ఉందా, లేదా అనేది తర్వాత తెలుస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement