పరస్పర అంగీకారంతోనే రేప్లు జరుగుతున్నాయి | Rapes happen with mutual consent of boys and girls: SP leader | Sakshi
Sakshi News home page

పరస్పర అంగీకారంతోనే రేప్లు జరుగుతున్నాయి

Published Sun, Jun 7 2015 9:51 AM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

పరస్పర అంగీకారంతోనే రేప్లు జరుగుతున్నాయి - Sakshi

పరస్పర అంగీకారంతోనే రేప్లు జరుగుతున్నాయి

మణిపూరి: ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న సమాజవాదీ పార్టీ  (ఎస్పీ) నేతలు సంచలన వ్యాఖ్యలకు పెట్టింది పేరు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కేబినెట్లో మంత్రి తొతారాం యాదవ్ ... అత్యాచార (రేప్) ఘటనలపై తాజాగా స్పందించారు. యువతీయువకుల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని సెలవిచ్చారు. అంతేకాకుండా అత్యాచారాలు రెండు విధములు అని అవి.. బలవంతంగా జరిగేవి... మరోకటి పరస్పర అంగీకారంతో జరిగేవి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసి తన నోటి తీటను తీర్చుకున్నారు.


శనివారం మణిపూరిలోని జిల్లా జైలులో తోతారాం యాదవ్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో తోతారాం మాట్లాడారు. రాష్ట్రంలో అత్యాచార సంఘటనలు తగ్గుముఖం పట్టాయి కదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు తోతారం యాదవ్పై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement