
లక్నో: చావు ఎప్పుడు ఎవరిని ఎటునుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో హఠాన్మారణాలు ఎక్కువైపోయాయి. కళ్లముందేనవ్వుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి ఊపిరి వదులుతున్నారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో మృత్యువు మనిషిని తీసుకెళ్లి పోతుంది. తాజాగా గణేష్ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడు ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్‌పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్ మండపం వద్ద లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు.
చదవండి: మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్‌గారూ ఇదిగో!
అయితే స్టేజ్‌పై ప్రదర్శన చేస్తుండగా మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్‌పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
#मैनपुरी
— Network10 (@Network10Update) September 4, 2022
गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिरा
हनुमान जी का रूप धर नाच रहा था युवक
जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया
मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4
Comments
Please login to add a commentAdd a comment