ఐరన్ లోపం, రక్తహీనత లేదా అనీమియా. రక్తంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితినే రక్తహీనతగా గుర్తిస్తారు. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో భాగం. ఐరన్ లోపించినపుడు శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయదు. దీంతో శరీర కణజాలాలకు ఆక్సిజన్ తగ్గిపోతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఐరన్ లోపాలను ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పోషకాహార లోపం, స్త్రీలు ఋతుస్రావం సమయంలో రక్తాన్ని కోల్పోవడం, గర్భధారణ సమయంలో స్త్రీలలో వచ్చే సమస్యలు, పెప్టిక్ అల్సర్, హయాటల్ హెర్నియా, పెద్దప్రేగు పాలిప్ లేదా కొలొరెక్టల్ కేన్సర్ తదితర వ్యాధుల కారణంగా తీవ్రమైన ఇనుము లోపం వస్తుంది. రక్త పరీక్ష ద్వారా అనీమియాను గుర్తించవచ్చు. తొందరగా అలిసిపోవడం, నీరసం, ఆయాసం లక్షణాలు కనిపిస్తాయి.
ఐరన్ లోపం లక్షణాలు
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
రక్తహీనతతో వచ్చిన ఆక్సిజన్ కొరతను భర్తీ చేయడానికి గుండె మరింత రక్తాన్ని పంప్ చేయాలి. ఇది గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.
మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది. తలతిరగడం
మట్టి, సున్నం లాంటివి తినాలనిపించడం
తొందరగా చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత లోపించడం
చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోవడం.
నిద్ర సరిగ్గా పట్టకపోవడం, దురదలు రావడం.
తీవ్ర ఆందోళన
ఐరన్ లోపంతో ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది
ఆకలి మందగించడం, కాళ్లు, చేతులు చల్లగా అనిపించడం
జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నోటిలో పుళ్లు, నాలుక మంట
ఐరన్ లభించే ఆహారం
మాంసాహారం, బచ్చలికూర వంటి ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు
దానిమ్మ,ఎండుద్రాక్ష , ఆప్రికాట్లు వంటి ఎండిన పండ్లు, బెల్లం
ఐరన్-ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు, రొట్టెలు , పాస్తా, బటానీలు
రక్తహీనతను గుర్తించినపుడు సాధారణంగా కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేసుకోవచ్చు. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నపుడు వైద్యుల సలహా మేరకు ఇంజక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తహీనకు గల కారణాలను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు , దాన్ని బట్టి చికిత్సలు అవసరం. చికిత్స కంటే ముందు రక్తహీనతకు గలకారణాలను గుర్తించడం ముఖ్యం. అంతర్గతంగా ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి, అంతర్గతంగా రక్తస్రావం లాంటి కారణాలను విశ్లేషించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment