లైఫ్‌ జర్నీకి బోన్‌ స్ట్రెంగ్త్‌ | Bone Strength Is Important in Life | Sakshi
Sakshi News home page

లైఫ్‌ జర్నీకి బోన్‌ స్ట్రెంగ్త్‌

Published Mon, Oct 14 2019 10:02 AM | Last Updated on Mon, Oct 14 2019 10:02 AM

Bone Strength Is Important in Life - Sakshi

కండరాలే కాదు.. ఎముకలూ ముఖ్యమే ప్రత్యేక వ్యాయామాలతో అదనపు శక్తిచూడడానికి మంచి ఫిజిక్‌. బాడీ టోన్‌ సరే.. మరి శరీరంలోని బోన్స్‌(ఎముకల) సంగతి ఏమిటి? అవీ పటిష్టంగా ఉన్నట్టేనా? వ్యాయామం చేస్తూ చక్కని శరీర సౌష్టవం సొంతం చేసుకున్నా కొంత మందికి బ్యాక్‌ పెయిన్, మోకాలి నొప్పి, మడం నొప్పివగైరాలు ఎందుకు వస్తాయి? అంటే.. ‘బోన్‌ బలం వేరు.. కండలు తిరగడం వేరు’ అంటున్నారు కూకట్‌పల్లిలోని ప్రతిమ ఆస్పత్రికి చెందిన ఆర్థోపెడిక్‌ సీనియర్‌కన్సల్టెంట్‌ డాక్టర్‌ సాగి రాధాకృష్ణారావు. వ్యాయామం చేస్తే చాలదని, ఎముకల సామర్థ్యం పెరగడానికి ప్రత్యేకంగా మరికొన్ని వ్యాయామాలు తప్పక చేయాలనిసూచిస్తున్నారాయన. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

అందరికీ ‘లో’.. కొందరికే హై..
ప్రతి అడుగులో ఒక కాలి వెయిట్‌ పడుతుంటుంది. కాబట్టి వాకింగ్‌ ఎముకల బలోపేతానికి మేలు చేస్తుంది. అలాగే జాగింగ్‌ కూడా ఓకే. అయితే రెండు కాళ్ల బరువు ఒకేసారి పడే అవకాశం ఉండేది జంపింగ్స్‌లోనే. తద్వారా బోన్‌ క్వాలిటీ బాగా మెరుగవుతుంది. అయితే ఈ తరహా హై ఇంపాక్ట్‌ వ్యాయామాలు అందరూ చేయలేకపోవచ్చు. అంతేకాక దీనివల్ల గాయపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.  

‘డీ’ కొట్టాల్సిందే..
వ్యాయామంతో పాటు ఎముకల్లో బలానికి ‘విటమిన్‌ డి’ అంతకు మించిన అవసరం. కాబట్టి శారీరకంగా చూడడానికి బాగుండడం మాత్రమే కాకుండా మంచి బోన్‌ స్ట్రెంగ్త్‌కావాలనుకునేవారు తప్పకుండా సూర్యరశ్మి సోకే చోట ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిది. సూర్యరశ్మి సోకడం వల్ల శరీరానికి ‘డి విటమిన్‌’ లభ్యతతో పాటు అదిశరవేగంగా శక్తిగా మారి ఎముకల్లోనిల్వ అయ్యేందుకు వ్యాయామంతోడ్పడుతుంది. కాబట్టి పైన పేర్కొన్న వ్యాయామాల్లో కొన్నయినా వీలైనంతఎండ పడే చోట చేయడం మంచిది.  

ప్రభావం చూపేవి ఎంచుకోవాలి
ఎముకల బలానికి శారీరక శ్రమ ఉపకరిస్తుందనేది వాస్తవం. అయితే, వీటిలో బోన్స్‌కి మేలు చేసే వ్యాయామాలను ‘నో ఇంపాక్ట్, లో ఇంపాక్ట్, హై ఇంపాక్ట్‌’గా విభజించవచ్చు. స్విమ్మింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రెచ్‌ ఎక్సర్‌సైజ్‌లు, సైడ్స్, క్రంచెస్‌.. ఇలాంటి వాటిని బోన్స్‌పై నో ఇంపాక్ట్‌ అని చెప్పొచ్చు. అలాగే వాకింగ్, పంచెస్, లంజెస్, కిక్స్‌.. వంటివి లో ఇంపాక్ట్‌ వ్యాయామాలుగా, స్టెప్‌ ఎరోబిక్స్, జంపింగ్‌ జాక్స్, నడుముకి రోప్‌ కట్టుకుని చేసే జంపింగ్స్, స్కిప్పింగ్‌.. వగైరాలను హై ఇంపాక్ట్‌ వ్యాయామాలుగా చెప్పొచ్చు.  

స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌
ఎముకల బలాన్ని కోరుకునేవారు మరీ ఎక్కువ కాకుండా తగినంత బరువు శరీరం మోయగలిగితే ఆ మేరకు ఎముకల సామర్థ్యం మెరుగవుతుంది. దీనికి వెయిట్స్‌ను లిఫ్ట్‌ చేయడం ద్వారా చేసే స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ ఒక మార్గం. దీనిలో చేతులు, ఛాతి, కాళ్లు.. ఇలా అన్ని శరీర భాగాలలోని బోన్స్‌కి వ్యాయామాన్ని అందించేందుకు వీలుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement