
టెక్సాస్: పెరుగు ఆరోగ్యానికి మంచిది. ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే జలుబు చేసినప్పుడు ఎక్కువ అవుతుందని చాలామంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ పెరుగు జలుబు లక్షణాలను తగ్గిస్తుందని అమెరికాలోని నేషనల్ డైరీ కౌన్సిల్‌లోని న్యూట్రీషియన్ రీసెర్చి వైస్ ప్రెసిడెంట్ మైకీ రుబిన్ తెలిపారు. పెరుగులో ఉండే జింక్, ప్రోబయాటిక్స్‌లు జలుబును నియంత్రించడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.