ఈ రెస్టారెంట్ నిండా ఎముకలే..! | This restaurant full of bones ..! | Sakshi
Sakshi News home page

ఈ రెస్టారెంట్ నిండా ఎముకలే..!

Published Sat, Dec 20 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

ఈ రెస్టారెంట్ నిండా ఎముకలే..!

ఈ రెస్టారెంట్ నిండా ఎముకలే..!

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు! మెక్సిలో ఇటీవలే ప్రారంభమైన ఈ రెస్టారెంటుకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. పైకి మామూలుగానే కనిపిస్తున్నా, ఈ రెస్టారెంటు లోపలకు వెళ్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఇంటీరియర్ మొత్తాన్ని జంతువుల ఎముకలు, పుర్రెలతో అలంకరించారు.

ఇందుకోసం ఏకంగా 10 వేలకు పైగా ఎముకలు, పుర్రెలు ఉపయోగించారు. వీటిలో చాలావరకు నిజమైనవే కాగా, కొన్ని మాత్రం అల్యూమినియంతో తయారుచేశారు. ఇగ్నాకియో కడెనా అనే ఆర్కిటెక్ట్ ఈ డిజైన్‌ను రూపొందించారు. తెల్లని పెయింట్, అందంగా అమర్చిన ఎముకలతో ఈ రెస్టారెంటు చాలామందిని ఆకర్షిస్తోంది.

అయితే, శాఖాహారులు, జంతు ప్రేమికులు ఇందులో కనీసం సలాడ్ కూడా తినడానికి ఇష్టపడకపోవచ్చని కడెనా పేర్కొంటున్నారు. అన్నట్టు ఈ రెస్టారెంటు పేరు.. ‘హ్యూసో’. అంటే ఎముక అని అర్థం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement