ప్రతీకాత్మక చిత్రం
కాన్‌బెర్రా : యాభై ఏళ్లు పైబడిన తర్వాత ఎముకలు విరగటం వల్ల తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువని తాజా పరిశోధనలో తేలింది. 50ల తర్వాత ఎముకలు విరిగిన వారు 10సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని వెల్లడైంది. ఆస్ట్రేలియాకు చెందిన ‘‘గర్వాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రేలియా’’ జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగుచూశాయి. వయసు పైబడిన వారిలో.. నడుము ఎముకలు విరగటం వల్ల 10సంవత్సరాలు, శరీరంలోని మిగిలిన ఎముకలు విరగటం ద్వారా 5సంవత్సరాలు ముందుగా చనిపోయే అవకాశం ఉందని తెలిపింది. 2001లో డెన్మార్క్‌లోని 50ఏళ్లు పైబడిన వారు ఎముకలు విరగటం మూలంగా పది సంవత్సరాలు తొందరగా చనిపోయారని పేర్కొంది.
ఈ ప్రమాదం మగవారిలో 33శాతం ఉంటుందని, ఆడవారిలో 20 ఉంటుందని వెల్లడించింది. పరిశోధకుడు జాక్వెలిన్ సెంటర్ మాట్లాడుతూ.. ఎముకలు విరగటం అన్నది ఆరోగ్య సమస్యలు రావటానికి ప్రధాన కారణమని, నయం కావటానికి ఎక్కువ సమయం పట్టటమే కాకుండా తొందరగా మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు. ఎముకలు విరగటానికి గల కారణాలను అన్వేషించి దానికి అనుగుణంగా చికిత్స చేసే విధానాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment