Slim Beauty
-
ఎక్కువ శ్రమ లేకుండా.. బాడీ స్లిమ్‌గా ఎలా..!?
అధిక బరువు ఆరోగ్యానికే కాదు అందానికీ శత్రువే. ఆ బరువును తగ్గించుకోవడానికి మితాహారం.. వ్యాయామాలే మార్గం అంటారు ఫిట్నెస్ నిపుణులు. మితాహారం ఓకే.. అతికష్టమ్మీద నాలుకను చంపుకొని కడుపు కట్టుకోవచ్చు. కానీ మైండ్‌ని ఎంత ప్రిపేర్ చేసినా వ్యాయామానికి సిద్ధమవదు. ఓ పక్క బద్ధకం అడ్డొస్తుంది. అందుకే ఈ ఎక్సర్సైజ్ కుషన్ చూడండీ.. చాలా యూజ్ అవుతుంది. పెద్దగా శ్రమ లేకుండానే బాడీని స్లిమ్‌గా మారుస్తుంది. ఇది కాళ్లు, తొడలు, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును ఇట్టే కరిగిస్తుంది. శరీరం సన్నగా, అందంగా అవడానికి సహకరిస్తుంది. దీని సాయంతో వ్యాయామం చేస్తే.. కొవ్వు తగ్గి నాజూగ్గా మారుతారు. ఈ ఎక్సర్సైజర్కి ఇరువైపులా కాళ్లు పెట్టుకోవడానికి వీలుగా హోల్స్ ఉంటాయి. వాటిలోకి కాళ్లను జొప్పించి.. పడుకుని లేదా కూర్చుని చిత్రంలో చూపించిన విధంగా వ్యాయామం చేసుకోవచ్చు. దానివల్ల.. పొట్ట నుంచి కాళ్ల వరకూ పేరుకున్న కొవ్వు వేగంగా తగ్గుతుంది. ఈ టూల్‌ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఇది ఇంట్లో ఉంటే.. మీకు కావాల్సిందల్లా కాస్త స్థలం.. కొంత సమయం మాత్రమే. అవిరెండూ దొరికితే.. అందం, ఆరోగ్యం మీ సొంతం. పక్షవాతంతో బాధపడుతున్న కొందరు (కాస్త కదలికలున్నవారు) పేషెంట్స్ కూడా ఈ టూల్‌ని ఉపయోగించి.. వ్యాయామం చేసుకోవచ్చు. రెడ్ లేదా బ్లాక్ కలర్స్‌లో ఈ ఎక్సర్సైజ్ కుషన్ అందుబాటులో ఉంది. దీని ధర 51 డాలర్లు. అంటే 4,219 రూపాయలన్న మాట. ఇవి చదవండి: Naila Grewal: నా యాక్టింగ్‌కి 'టెలివిజనే' నాకు ప్రేరణ! -
పొట్ట, నడుము దగ్గర పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.. ధర రూ. 1,899
ఈ రోజుల్లో నాజూగ్గా ఉండటమే అసలైన అందం. ఎక్కడా ఇంచ్ ఎక్స్ట్రా కొవ్వు లేకుండా శరీరం ఓ ఆకృతిలో ఉంటేనే వేసుకున్న డ్రెస్‌కైనా .. కట్టుకున్న చీరకైనా అందమని చాలా మంది భావిస్తారు. ఛాయ తక్కువైనా, మొహం మీద మొటిమలూ.. మచ్చలూ ఉన్నా, ఒంటి మీద నూగు మెరుస్తున్నా కవర్ చేసుకోవడం సులభమే కానీ.. స్థూలకాయాన్ని కవర్ చేసుకోవడం కుదరదు. అందుకే చాలా మంది లావుగా ఉండటమే తమ అందానికి అసలైన సమస్యగా భావిస్తుంటారు. అలాంటివారి కోసమే ఈ డివైజ్ (స్లిమ్మింగ్ బెల్ట్). 360 డబుల్ హెలిక్స్ సెంట్రిఫ్యూగల్ టెక్నాలజీతో రూపొందిన ఈ డివైజ్.. బాడీలో కొవ్వును చాలా వేగంగా తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఆటో అండ్ మాన్యువల్ డ్యూయల్ మోడ్ కలిగిన ఈ మెషిన్‌ను వినియోగించడం చాలా సులభం. వైబ్రేటెడ్ ట్యాపింగ్, బయోనిక్ మసాజ్‌తో నొప్పి లేకుండానే సమస్యను పరిష్కరిస్తుంది. పైగా దీన్ని ధరించడం వల్ల రిలాక్సింగ్‌గానూ ఉంటుంది. పొట్ట, నడుము, తొడలు, కాళ్లు, చేతులు.. ఇలా ప్రతిచోటా పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది ఈ మెషిన్. దీనికి చార్జింగ్ పెట్టుకోవచ్చు. లావుని బట్టి..టైట్‌గా పట్టేందుకు బెల్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్‌కి ఎడమవైపు మోడ్స్, పవర్ బటన్, ఆన్/ఆఫ్, స్పీడ్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. దీని ధర 25 డాలర్లు. అంటే 1,899 రూపాయలు. ఇది మీ వెంట ఉంటే.. సన్నజాజి సోకు మీదే మరి. చదవండి: Laser Comb Uses: విగ్గు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఒత్తైన కురులు.. నొప్పి ఉండదు.. ధర ఎంతంటే! -
ఆ ఒత్తిడి వల్లే తగ్గా!
‘బొద్దుగా లడ్డూలా ఉన్నావ్.. ఏం తింటున్నావో ఏంటో.. తినడమే పనిగా పెట్టుకున్నావా ఏంటి?’ అని పరిణీతి చోప్రాను మొహం మీదే అడిగినవాళ్లు చాలామందే ఉన్నారు. ఆ రేంజ్లో ఉండేవారామె. తొలి చిత్రం ‘ఇషక్‌జాదె’లో కూడా బొద్దుగానే కనిపించారు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాల్లో కూడా పాత తరం నాయికలా నిండైన బుగ్గలతో పుష్టిగా ఉండేవారు. దాంతో విమర్శలపాలయ్యారు. ఇక లాభం లేదనుకుని, పరిణీతి తగ్గారు. ఇప్పుడీ స్లిమ్ బ్యూటీకి ప్రశంసలే ప్రశంసలు. అవునూ.. అసలెందుకు తగ్గాలనిపించింది? అనే ప్రశ్న పరిణీతి ముందుంచితే - ‘‘హీరోయిన్ కాకపోయి ఉంటే ఎప్పటికీ తగ్గేదాన్ని కాదేమో. ‘లావుగా ఉన్నావ్.. సన్నబడకపోతే సినిమాలు రావు’ అని అందరూ ఒత్తిడి చేయడంవల్ల తగ్గాను. నేనిప్పుడింత స్లిమ్‌గా ఉన్నానంటే ఆ ఘనత హిందీ పరిశ్రమకే దక్కుతుంది’’ అని చెప్పారు. తగ్గాక చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటున్నారని పరిణీతి చెబుతూ - ‘‘ఈ మధ్య షాపింగ్ మాల్స్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో నేను కనిపిస్తే చాలు అమ్మాయిలు చుట్టుముట్టేస్తున్నారు. ముఖ్యంగా లావుగా ఉన్న అమ్మాయిలు ‘భలే తగ్గారే. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేమూ తగ్గుతాం’ అంటుంటే వినడానికి ఆనందంగా ఉంది’’ అన్నారు.