తిన్నది.. కరిగిద్దామిలా..! | Exercise Can Bring Mental Calm And Physical Activity | Sakshi
Sakshi News home page

తిన్నది.. కరిగిద్దామిలా..!

Published Tue, Jul 16 2019 8:50 AM | Last Updated on Tue, Jul 16 2019 8:50 AM

Exercise Can Bring Mental Calm And Physical Activity - Sakshi

సాక్షి, చిత్తూరు కలెక్టరేట్‌:  ప్రస్తుతం జీవనం యాంత్రికమైంది. కేవలం ధనార్జన, ఉద్యోగ బాధ్యతలతో  బిజీగా మారిపోయి, ఆరోగ్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. తినేది జంక్‌ఫుడ్‌ అని, ఎలాంటి ప్రయోజనం లేదని తెలిసినా ఆకలి తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిని, సరిపెడుతున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రుగ్మతలకు శారీరక శ్రమ లేమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. కొం దరు వ్యాయామశాలలకు వెళ్లే సమయం లేక, మ రికొందరు ఇంకోరోజు చేద్దాంలే అని వాయిదాలు వేస్తున్నారు. మారిన ఆహారపు  అలవాట్లు, జీవనశైలి, పని విధానాలతో కేలరీలు కరగకపోగా, కొ త్తగా  వచ్చి చేరుతున్నాయి. ఇందుకోసం బరువులు ఎత్తడం, జిమ్‌లకు వెళ్లడం, కిలోమీటర్ల నడక లాంటివేకాకుండా కేవలం చిన్న చిన్న పనులతో కూడా తగ్గించుకునే ప్రయత్నాలు చేసుకో వచ్చు. ఇంటి పనులు, వ్యాయామం చేసిన దాంతో సమానమని, దీనికి తోడు మానసిక ప్రశాంతత లభిం చడంతోపాటు తెలియకుండానే శారీరక శ్రమ  పెరగడం వల్ల రెండు రకాలుగా ఉపయోగాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇంటిని శుభ్రం చేయడంతో..
ఖాళీ సమయాల్లో బయటకు వెళ్లే పనిలేకపోతే ఇంట్లోనే ఉండి దుమ్ము దులపడమే పనిగా పెట్టుకోండి. రోజులో కాసేపు గదుల్లో పట్టిన బూజును శుభ్రం చేస్తే ప్రయోజనం ఉంటుంది. రోజూ 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే 128  కేలరీల కొవ్వును కరిగించుకోవచ్చనని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇంటి పనులు చేస్తే, ఇల్లు శుభ్రపడడంతో పాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. 

కాసేపు తోట పనిచేస్తూ.. 
ఎవరి పనులే వారే చేసుకో వడం ఉత్తమం. ఇంటి గార్డెన్‌లో మొక్కలను నాటడం, నాటిన మొక్కలకు నీరు పోయడం, పరిసరాలు శుభ్రం చేయడం, బాగా పెరిగిన ఆకులు, కొమ్మలను కత్తిరించడం లాంటి పనులు శరీరానికి శ్రమను కలిగిస్తాయి. రోజు 40 నిమిషాలపాటు ఈ తరహా పనులు చేస్తే సుమారు 200  పైగా కేలరీలు తగ్గించుకోవచ్చు. చెట్లు, పచ్చదనం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంటాయి. 

లిఫ్ట్‌కు దూరంగా..
 భవనాల్లో వారి ఇంటికో, కార్యాలయానికో వెళ్లాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్‌ ఆశ్రయిస్తుంటారు. ఈ విధానానికి చెక్‌ పెట్టాలి. సాధ్యమైనంతవరకు మెట్లు ఎక్కే ప్రయత్నం చేయాలి. కనీసం ఒకటి రెండు అంతస్తులనైనా ఎక్కేందుకు ప్రయత్నం చేస్తే సుమారు 200 కేలరీలు వరకు కొవ్వు కరుగుతుంది. 

సైకిల్‌ని వినియోగించడం  
సైకిల్‌ తొక్కడం ఎక్కువ మందికి ఇష్టం. వారంలో ఒక్క రోజైనా రోడ్లపైన సైకిల్‌ తొక్కేందుకు ఆసక్తి చూపాలి. ఇంటికి కాస్త దూరంలో ఉండే పనులు చేసేందుకు ఎక్కువ మంది ద్విచక్రవాహనాలను వినియోగిçస్తుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా సైకిల్‌పై వెళితే మంచిది. రోజూ అరగంటపాటు సైకిల్‌ తొక్కితే దాదాపు 210 కేలరీలు తగ్గించుకున్నట్లే. 40 నిమిషాలపాటు కూర్చోకుండా నిలబడితే సుమారు 100 కేలరీలు కరుగుతాయట. రోజంతా ఒకే చోట కూర్చొని పనిచేసే వారు కొద్దిసేపు లేచి నిలబడి తిరగడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

స్కిప్పింగ్‌తో 
ఇంటిలో ఉదయం పూట, వాకింగ్‌ చేసే మైదానంలో రోజూ కాసేపు స్కిప్పింగ్‌ చేయండి. 10 నుంచి 15 నిమిషాలు ఎగురుతూ గెంతుతూ స్కిప్పింగ్‌ చేస్తే వందకుపైగా కేలరీలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.  

నృత్యంతో ..
సంగీతం వినపడగానే  కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటల ను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు నృ త్యం చేస్తే మేలు. చెమట చిందించడంతో పాటు కొ వ్వు కరిగే అవకాశం ఉంది. 20 నిమిషాలపాటు డ్యాన్స్‌ చేస్తే 100 నుంచి 120 వరకు కేలరీలు తగ్గించుకోవచ్చు. డ్యాన్స్‌ చేశామనే తృప్తి, ఆనందం మిగులుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement