దొండపర్తి (విశాఖ దక్షిణ): జుంబా డ్యాన్స్‌కు క్రేజ్ పెరుగుతోంది. ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలు చేసి బోర్ కొట్టినవారంతా.. ఇప్పుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. శ్రమపడినట్టు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుంది. పైగా ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో జుంబా డ్యాన్స్ పై ఆసక్తి చూపుతున్నవారు క్రమంగా ఎక్కువ అవుతున్నారు.
చదవండి: ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. ఇష్టపడి పెళ్లిచేస్కొని.. వ్యాయామం చేస్తూ..
కొన్నాళ్ల క్రితం వరకు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ జుంబా క్రేజ్ ఇపుడు విశాఖకు కూడా పాకింది. దీనికి అనుగుణంగానే వరుణ్ గ్రూప్ జుంబా డ్యాన్స్ విశాఖవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని జుంబా డ్యాన్స్ ట్రైనర్ మధుసింగ్ చెప్పారు. జుంబా డ్యాన్స్‌కు సంబంధించి ఆమె మరిన్ని వివరాలు చెప్పారు. అవి ఆమె మాటల్లోనే...
అనేక ప్రయోజనాలు
►జుంబా డ్యాన్స్‌తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడేలా కూడా చేస్తుంది.
►జుంబా డ్యాన్స్ ఎరొబిక్స్‌ను పోలి ఉంటుంది. కొవ్వును అధిక స్థాయిలో కరిగించుకోడానికి ఉపకరిస్తుంది.
►బరువు తగ్గడంతో పాటు డ్యాన్స్‌తో తల నుంచి పాదాల వరకు ప్రతి అవయవం కదులుతుంది. ఇది ఫిజికల్ ఎక్సర్‌సైజ్ మాత్రమే కాదు. మెదడుకు కూడా ప్రశాంతతను అందిస్తుంది.
►ఊపిరితిత్తుల పవర్ పెరుగుతుంది. శ్వాస సంబంధిత సమస్యలను అధిగమించేలా చేస్తుంది. కండరాలు బలంగా ఉండేలా సహాయపడుతుంది. రెగ్యులర్‌గా ఈ డ్యాన్స్ చేయడం వల్ల వయస్సు మీద పడనీయకుండా కాపాడుతుంది.
►ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చేసే ఈ డ్యాన్స్‌తో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
జుంబా డ్యాన్స్ సెషన్స్‌ను ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 5 నుంచి 6 వరకు...తిరిగి 7.30 గంటల నుంచి 8.30 గంటల వరకు ఒక్కో బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నాం. ఎప్పుడూ ఒకేరకం వ్యాయామాలు చేసి బోర్ కట్టిన వారంతా ఇపుడు జుంబా డ్యాన్స్ వైపు మొగ్గు చూపుతుండడంతో విశాఖలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించాం.
ఆరోగ్యం.. మానసిక ఉల్లాసం..
జుంబా డ్యాన్స్ కార్డియోవాస్కులర్, ఫ్యాట్ బర్నింగ్ యాక్టివిటీగా చాలా ఫేమస్ అయింది. పిల్లలతో పాటు పెద్దలు, మధ్యవయస్సు మహిళలు కూడా జుంబాపై ఆసక్తి చూపిస్తున్నారు. జుంబా ద్వారా గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. ఏరోబిక్స్‌లో కన్నా జుంబా ద్వారా ఎక్కువ కేలరీలను బర్న్ చేయవచ్చు. ఒక గంటలో 300 నుంచి 400 క్యాలరీలను కరిగించుకోవచ్చు. అందుకే జుంబా వర్కౌట్ ద్వారా త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
– మధు సింగ్, జుంబా డ్యాన్స్ ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment